ట్విట్టర్ సేవలు బుధవారం మరోసారి నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూసర్ లు నానా ఇబ్బందులు ఎదురుకున్నారు. ఎర్రర్ మెసేజ్ లు కనిపించి చాలా మందికి చిరాకు తెప్పించాయి. ఇటీవల కాలంలో ఇలాంటి అంతరాయాలు చలాసారులు జరిగాయి. కేవలం ఇండియాలోనే కాదు అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి పలు దేశాలల్లో ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. దీనికి సాంకేతిక కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ఇంతకుముందు లేని విధంగా ఎలాన్ మస్క్ సిఈఓ గా వచ్చాకే ఇలాంటి అవాంతరాలు ఎందుకు వస్తున్నాయి అనే కొత్త చర్చ మొదలయింది.
అందులో పని చేసే నిపుణులు దీనికి గల కారణాలను వెతుకుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలాన్ మస్క్ ఉద్యోగులను తొలగించడం ప్రధాన సమస్యగా మారింది. ఉన్న తక్కువ మంది ఉద్యోగుల మీద ఎక్కువ పని భారం పడుతోంది. అక్కడి ఉద్యోగులు మన ఉద్యోగుల వలె ఎక్కువ సమయం త్యాగం చేయరు. వాళ్ళ డ్యూటీ అయిపోగానే ఒక్క నిముషం కూడా పని చేయకుండా కంప్యూటర్ మూసి ఇళ్ళకు వెళ్ళిపోతారు. కంపెనీ మునిగిపోయినా పట్టించుకోరు.
ఈ పని ఒత్తిడి సమస్య మన దేశంలో మరీ ఎక్కువుంది. మనదేశంలో ట్విట్టర్ కార్యాలయాలు మూడు మాత్రమే ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఢిల్లీ, ముంబాయి కార్యాలయాలు ముసేయాలని అనుకుంటోంది. బెంగుళూరు లోని ఒకే కార్యాలయం ఉంచాలని భావిస్తోంది. దానితో ఈ సమస్యలు ఇండియాలో మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
౦౦౦