టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్ అసలు రంగు బయటపడుతోంది. అతని మొబైల్ ను పరిశీలించిన పోలీసులు..యువతులతో ప్రవీణ్ సన్నిహితంగా మాట్లాడిన వీడియోలు, నగ్నచిత్రాలను గుర్తించారు. మొత్తం 48మంది యువతులతో అతనికి సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో ఈ పేపర్ లీక్ వ్యవహారంలో వీళ్ళకు కూడా ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
వీళ్ళంతా ఎవరు..? ప్రవీణ్ తో ఎలా కాంటాక్ట్ అయ్యారు..? వీళ్ళంతా టీఎస్ పీస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారేనా..? తనతో శారీరకంగా కలిస్తే పేపర్ లీక్ చేస్తానని ప్రవీణ్ ఆఫర్ ఇచ్చి వారితో సన్నిహిత సంబంధం ఏమైనా పెట్టుకున్నాడా..? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రవీణ్ తో సన్నిహితంగా మెదిలిన యువతుల వివరాలను సేకరించి వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే విచారణలో ప్రవీణ్ పెద్దగా నోరు విప్పడం లేదని…అందుకే అతని ఫోన్ నుంచి సేకరించిన సమాచారంతో అతనితో సన్నిహితంగా మెదిలిన యువతులను విచారణకు పిలిచే అవకాశం లేకపోలేదు.
2017 నుంచి ప్రవీణ్ మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు రికవరీ చేసే పనిలో ఉన్నారు. 2017 నుంచి టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో ఎన్ని పరీక్షలు నిర్వహించారు..? ఆ సమయంలో పరీక్షలకు సంబంధించిన పేపర్లను రహస్యంగా లీక్ చేశాడా..?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో మరో ట్విస్ట్
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన ఏ2 నిందితుడు, నెట్ వర్క్ అడ్మిన్ గా పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆట్ల రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజు బిజెపి కార్యకర్తగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువతను తమ విపు తిప్పుకునేందుకు రాజును అడ్డం పెట్టుకొని పేపర్ లీకేజీకి బీజేపీనే ప్లాన్ చేసిందని ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్టులను, బిజెపి నాయకులతో రాజు దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Also Read : టీఎస్పీఎస్సీ లీకేజీ : అసలేం ఏం జరుగుతోంది -పోలీసులు ఒకలా…టీఎస్పీఎస్సీ చైర్మన్ మరోలా..!