హమ్మా.. మీకే తెలివి ఉందా..మాకు లేదనుకుంటున్నారా…? అన్నట్లుగా టీఆర్ఎస్ , బీజేపీలు దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ నేతలపై గురి పెట్టగా..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏర్పాటైన సిట్ తో బీజేపీని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. గ్రానైట్ తరలింపులో జరిగిన అవకతవకల్లో టీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగించేందుకు ఐటీని బీజేపీ రంగంలోకి దించడంతో.. స్టేట్ జీఎస్టీ అధికారులను దించేసి బీజేపీ నేతల్లో కలవరం పుట్టిస్తోంది టీఆర్ఎస్. ఇలా రెండు పార్టీలు విచారణ సంస్థలతో రాష్ట్ర రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.
బీజేపీకి కేసీఆర్ సరెండర్ – లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ లేనట్టే..!?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితకు ప్రమేయముందని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ తథ్యమని ప్రకటించారు. దాంతో ఈ కేసులో ఏం జరగుతుందన్న ఉత్కంట అందరిలోనూ నెలకొంది. లిక్కర్ స్కాంలో ఎవరెవరి ప్రమేయం ఉందొ తేల్చేందుకు సీబీఐ, ఈడీలు దూకుడుగా పని చేస్తున్నాయి. బీజేపీ కనుసన్నలోనే ఈడీ, సీబీఐ లు పని చేస్తున్నాయని ఆరోపిస్తోన్న టీఆర్ఎస్… బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఉపయోగించుకుంటుందన్న ఆరోపణలు వస్తున్నాయి.
కొంతకాలంగా బీజేపీపై శివాలెత్తుతోన్న కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని.. పలు రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏర్పాటైన సిట్ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా చేయాలనుకుంటున్నారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కు కేంద్రం మొగ్గు చూపితే.. సిట్ తో బీజేపీ నేతలని కూడా అరెస్ట్ చేసేలా కేసీఆర్ పరోక్ష హెచ్చరికలు పంపుతున్నారు.
ముందస్తు రాగాలు – పాదయాత్రకు రేవంత్ ప్లాన్
మీకు మాత్రమే తెలివి ఉందా..? మాకు ఆమాత్రం తెలివి లేదా అంటూ టీఆర్ఎస్ , బీజేపీలు పోటాపోటీగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.