ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై టీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా సోమవారం తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలపరచిన ద్రౌపది ముర్ముకు ఓటేసిందని సీతక్క అభిప్రాయం తెలుసుకోకుండానే తెగ ప్రచారం చేసేసింది. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడిందని సీతక్క స్పష్టతనిచ్చారు. కొత్త బ్యాలెట్ పేపర్ అడిగానని… వారు ఇవ్వకపోవడంతో అదే బ్యాలెట్ ను బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి వచ్చిందని…
కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే తాను ఓటు వేశానునని సీతక్క క్లారిటీ ఇచ్చారు.
అయితే, సీతక్క ఓటును పరిగణనలోకి తీసుకుంటారా..? ఒకవేళ పరిగణనలోకి తీసుకుంటే ఆమె ఓటును కాంగ్రెస్ అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా లేక్కిస్తారా..? ద్రౌపది ముర్ము ఖాతాలో వేస్తారా..? అన్నది టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అప్పుడే తేల్చేసింది. ఎక్కడ కాంగ్రెస్ ను బద్నాం చేసేందుకు ఛాన్స్ దొరుకుతుందా అని గోతి కాడ నక్కలా వెయిట్ చేస్తోన్న టీఆర్ఎస్ సోషల్ మీడియా టీంకు సీతక్క తప్పిదం అందించిన అవకాశంగా భావించింది. అసలే… వరదల వెనక విదేశాల కుట్ర అనే కేసీఆర్ కామెంట్స్ పై ట్రోల్స్ ఓ రేంజ్ లో జరుగుతోన్న వేళ.. సోషల్ మీడియా టీం పై ప్రగతి భవన్ వర్గాలు ఒత్తిడి పెంచేశాయి. ఈ ట్రోలింగ్ ను ఆపేలా ఎదో ఒకటి చేయండ్రా అని ఆదేశాలతో స సీతక్క పొరపాటును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సీతక్క కావాలనే ద్రౌపది ముర్ముకు ఒటేసిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించారు. గతంలో ఓసారి సీతక్కపై బురదజల్లి తెలంగాణ సమాజం చేత మొట్టికాయలు వేయించుకుంది సోషల్ మీడియా టీం.
కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు కూడా మొహం చాటేశారు నేతలు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు , టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంట్లో సేదా తీరుతుంటే సీతక్క మాత్రం తన నియోజకవర్గంలోని ఆదివాసీలకు అమ్మైంది. నిత్యావసర సరకులు పంపిణీ చేసి శభాస్ అనిపించుకుంది. ఆ సమయంలో ఆమె చేసినసహాయక కార్యక్రమాలకు రాజకీయం అనే ముసుగు తొడిగి సీతక్కపై విమర్శలు చేసింది టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం. అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదు అన్నట్లుగా.. మీరు సహాయం చేయరు… చేసే వాళ్ళను కూడా చేయనివారా..? అంటూ టీఆర్ఎస్ పై ఎదురుదాడి ప్రారంభం అయింది. దాంతో స్వయంగా కేటీఆర్ రంగంలోకి దిగి.. మంచి చేసే చేతులకు చేయూతనివ్వకపోయినా పరవాలేదు.. అడ్డుగా ఉండొద్దు.. సీతక్కపై విమర్శలు చేస్తే మనకే ఇబ్బందికరం అవుతుందని వార్నింగ్ ఇవ్వడంతో సీతక్కపై ట్రోల్స్ ఆపేశారు. విలువల రాజకీయాలకు చిరునామా అయిన సీతక్కపై రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తప్పుడు ప్రచారం చేస్తుండటంతో సీతక్క అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.