ప్రగతి భవన్ లో రెండు రోజులుగా PK తో ఉత్కంఠం గా KCR చర్చలు …కొన్ని నెలలుగా తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వం పై ఓటర్ నాడీ గురించి సర్వే నిర్వహించిన PK ప్రగతిభవన్ లో కొందరు ముఖ్యనేతల ముందు ప్రజెంటేషన్ తో పాటు దేశ రాజకీయాలలో పొత్తుల గురించి సీరియస్ గా చర్చలు జరగడం తో తెలంగాణ రాజకీయాలు ఎటువైపు మళ్ల బోతున్నాయో అని నాయకులు ఆందోళన పడుతున్నారు .
TRS మరియు కాంగ్రెస్ ఉప్పు నిప్పు గా ఉన్న ఈ సందర్భం లో పొత్తు పొడవడం సాధ్యమా ?అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు .కొన్ని రోజులుగా సోనియాతో చర్చలు జరిపి కాంగ్రెస్ ను అధికారం లోకి తేవడానికి ఎన్నో ప్రజంటేషన్స్ ఇచ్చి నమ్మకం కల్పించిన PK కూడా పార్టీ లో చేరి కీలక పదవి పొందడం ఒక విశేషం .అందరూ అనుకొంటున్నట్లు TRS తో కాంగ్రెస్ పొత్తు కాదు ..కాంగ్రెస్ లో TRS విలీనం గురించి ప్రగతిభవన్ లో చర్చలు అని ఢిల్లీ నుండి అందుతున్న సమాచారం.
ఒకవేళ PK ప్రతిపాదనలు నచ్చితే TRS ఆవిర్భావ సభలో KCR ప్రకటన చేయవచ్చు .ఒకప్పుడు తెలంగాణ ఇస్తే TRS ను కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పిన KCR ఇప్పుడు అదే పనిచేయడానికి కారణం జనం లో వ్యతిరేకత తో పాటు తనను BJP టార్గెట్ చేయడం తో అరెస్ట్ చేయవచ్చు అన్న బలమైన సమాచారం ఉండటం తో తాను థర్డ్ ఫ్రంట్ రూపంలో రక్షణ పొందాలనుకున్నా అది సాధ్యం కాకపోవడంతో ప్రక్క రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు కూడా తనను అనుమానించడం సహకరించకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే తనను రక్షించగలదన్న PK సూచన ప్రాధాన్యత సంతరించుకొన్నది .
KCR కాంగ్రెస్ తో అలయెన్స్ కు ఒప్పుకోన్నా ఎన్నికలకు కలిసి వెళ్లడం అంత సులువు కాదు .అందుకే TRS ను కాంగ్రెస్ లో విలీనం చేయడం తో మళ్ళి CM గాKCR కు అవకాశం ఇచ్చేవిధంగా PK ప్లాన్ సిద్ధం చేసాడు .కానీ CM గా కాకుండా దేశ రాజకీయాలలో ప్రధాన పాత్రతో పాటు కీలక పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకున్నది .అవసరమైతే రాష్ట్రపతి పదవి KCR కు ..మొదని మూడు సంవచ్చారాల తరువాత KTR CM పదవి ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం .
ఎన్నికల తరువాత మొదటి 3 సంవచ్చారాల సమయం సోనియా నియమించే వ్యక్తి CM గా ఉండవచ్చు .ఇప్పుడు KCR పరిస్థితి “”డూ అర్ డై “”గా ఉన్నది .ఈ ప్రతిపాదన కాంగ్రెస్ లో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశరాజకీయాలలో కాంగ్రెస్ బ్రతకడం అవసరం ఉన్నది కాబట్టి కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చు