AICC మాజి ప్రెసిడెంట్ శ్రీ రాహుల్ గాంధీ గారి వరంగల్ పర్యటన తేది: 06-05-2022న
ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ ఆవరణలో జరుగనున్న రైతు సంఘర్షణ సభ సందర్భంగా పట్టణము నందు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడినవి.
హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చు వాహనాలు పెద్దపెండ్యాల ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఉనికిచెర్ల, వడ్డేపల్లి చర్చ్, ఎన్జీవోస్ కాలనీ మీదు చేరుకోవాల్సి ఉంటుంది.
బహిరంగ సభకు హైదరాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు ఫాతిమా (మదర్ థెరిస్సా) జంక్షన్ వద్ద ప్రజలను దించి తిరిగి మడికొండ వైపుగా ఈనాడు ఆఫీసు ఎదురుగావున్న పార్కింగ్ స్థలంలో తమ వాహనాలు నిలుపుకోవలయును.
ఖమ్మం, మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలు నాయుడు పెట్రోల్పంపు, ఉర్సుగుట్ట, హంటర్ రోడ్డు మీదుగా నీలిమ జంక్షన్ (విష్ణుప్రియ గార్డెన్స్) వద్ద ప్రజలను దించి ప్రకాశ్ రెడ్డిపేట పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకోవలయును. అక్కడ పార్కింగ్ పూర్తయితే WIMS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయవలయును.
ములుగు, భూపాలపల్లి ప్రాంతాల నుండి సభకు వచ్చే వాహనాల ప్రజలను కాళోజీ సెంటర్లో దించి హయగ్రీవాచారి కాంపౌండ్లో పార్కింగ్ చేసుకోవలయును. అక్కడ పార్కింగ్ పూర్తయితే ములుగురోడ్డు వద్ద ఎల్బీ కాలేజి ఆవరణలో పార్కింగ్ చేయవలయును.
కరీంనగర్ వైపునుండి వచ్చే వాహనాలు కాళోజీ సెంటర్లో ప్రజలను దించి KUC SVS కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయవలయును.
వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు అంబేద్కర్ జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, వడ్డేపల్లి చర్చ్ మీదుగా మదర్ థెరిస్సా జంక్షన్ వైపు ప్రయాణించి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. లేదా కరీంనగర్ రోడ్, కెయుసి, చింతగట్టు వద్ద ఔటరింగ్ రోడ్డు మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.
తేది: 06-05-2022 మధ్యాహ్నం 2-00 గంటల నుండి హన్మకొండ కాళోజీ జంక్షన్ నుండి కాజిపేట వైపుకు ఎలాంటి భారీ వాహనాలు అనుమతించబడవు. కావున ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని విజ్ఞప్తి చేయుచున్నాము.
పోలీస్ కమిషనర్, వరంగల్