అమెరికా, ఇంగ్లాండ్ ను వణికిస్తోన్న కరోనా సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15 తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ తరహ కేసులు రాష్ట్రంలో మూడు నమోదైనట్లు హైదరాబాద్ లోని జన్యు ఆధారిత ప్రయోగశాల తెలిపింది. కరోనా సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ15 శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఈ కేసులు వెలుగు చూడగా, తాజాగా తెలంగాణలో కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
కొవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 ని న్యూయార్క్‌లో గుర్తించారు జేపీ వీలాండ్ సహా ఇతర జన్యు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్ వైరస్ ను వేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ గా తెలిపారు. దీనివల్ల కరోనా వేవ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇది ఓమిక్రాన్ వేరియంట్ కంటే ప్రమాదకారి అని, చాలా వేగంగా వ్యాప్తి చెందగల సామర్ధ్యం ఈ వేరియంట్ కు ఉందని చెబుతున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ లో 40శాతానికి పైగా కరోనా వ్యాప్తికి ఈ వేరియంట్ కారణమని వైద్యా, ఆరోగ్య నిపుణులు తెలిపారు.
కొత్త వేరియంట్ ల వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల కేంద్రం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. వచ్చే 40రోజులు అప్రమత్తంగా ఉండాలని..ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన కరోన చాప చుట్టేయడం ఖాయమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా నిబంధనలను పాటించాలని గైడ్ లైన్స్ విడుదల చేశాయి.
Also Read : కోరలు చాచిన కరోనా – ఒక్కరోజే పది లక్షల కేసులు