జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. మొదట్లో టీడీపీ నేతలను పలు కేసుల పేరుతో అరెస్ట్ చేయించిన జగన్ రెడ్డి తాజాగా చంద్రబాబును కూడా అరెస్ట్ చేయించారు. బాబు అరెస్ట్ రాజకీయ కక్ష అని మాట్లాడిన లోకేష్, పవన్ కళ్యాణ్ లను కూడా లోపల వేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. వైసీపీ నేతల బెదిరింపులకు సీఐడీ కూడా జత కలిసింది. అనంతరం మంత్రులు తమ వంతు వచ్చిందనుకున్నారో ఏమో కానీ రెచ్చిపోయారు. చంద్రబాబు 420అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
అంబటి రాంబాబు లోకేష్ ను టార్గెట్ చేస్తూనే మరోసారి పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై మాట్లాడారు. ఈ సినిమా కలెక్షన్స్ పై విచారణ చేయించి బ్రో ను క్లోజ్ చేయిస్తానని బెదిరించారు. చంద్రబాబును అరెస్ట్ పై సీఐడీపై పలు అనుమానాలను వ్యక్తం చేసినందుకు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తామని సీఐడీ చీఫ్ చెప్పారు. లోకేష్ ను ఈ స్కిల్ స్కామ్ లో ప్రశ్నిస్తామన్నారు. రాజధాని అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ లోకేష్ పేరు ఉందన్నారు.
లోకేష్ ను ఎందుకు ప్రశ్నించాల్సి ఉందని సీఐడీ చెప్పారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ మూడు కేసుల విషయంలో.. లోకేష్ ఆయా మంత్రిత్వ శాఖలోనూ లేరు. అయినా లోకేష్ ను ప్రశ్నిస్తామని చెప్పడం చూస్తుంటే సీఐడీ ఎవరి కనుసన్నలో పని చేస్తుందో చెప్పొచ్చునని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామికంగా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తూ…అరెస్ట్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుందని అంటున్నారు.
Also Read : పురందేశ్వరి ఇమేజ్ డ్యామేజ్ చేసిన నిర్మలా సీతరామన్..!