అధిక మోతాదు ఆరోగ్యానికి చేటని పెద్దలు చెపుతారు. సెల్ ఫోన్ అధికంగా వాడేవారికి కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఇంకా నమ్మకపోతే ఈ వార్త చదవండి. లండన్ కి చెందిన 29 ఏళ్ల ఫెన్నెల్ల ఫాక్స్ వర్టిగో అనే అమ్మయి ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యి వీల్ చేర్ కి పరిమితమయ్యింది. ఆమెకు అన్నిరకాల వైద్య పరిక్షలు చేసినా రోగం ఏమిటో డాక్టర్లకు అర్థం కాలేదు. అసలు రోగం ఏమిటో తెలిస్తే కదా మందు ఇవ్వడానికి? ఆమె పరిస్టితి రోజు రోజుకు క్షిణిస్తోంది. ఇది ఇప్పటివరకు మెడికల్ చరిత్రలో రాని కొత్తరకం రోగమని డాక్టర్లు చేతులు ఎత్తేశారు.
ఆ తర్వాత ఆ కొత్త రోగాన్ని తెలుసుకోడానికి శాస్త్రవేత్తల బృందం రంగంలోకి దిగింది. ఆమె వివరాలు సేకరించారు. సోషల్ మీడియాలో రోజుకు దాదాపు 14 గంటలు స్క్రోలింగ్ చేసినటు ఆమె డాక్టర్లతో పాటు ‘ది మిర్రర్’ అనే వార్తా సంస్టకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో చెప్పింది. ఐ ప్యాడ్, ఐ ఫోన్ కూడా విరివిగా వాడినట్లు చెప్పింది. అక్కడినుంచి ఆమెకు అంటుకున్న కొత్త రోగం ఏమిటో తెలిసింది. సెల్ ఫోన్ లో వాడే చిప్ లో రేడియేషన్ కీలక పాత్ర వహిస్తుంది. ఆ రేడియో ధార్మిక కిరణాలూ ఆమె చెవుల ద్వారా బ్రెయిన్ మీదా ప్రభావం చూపి ఉంటాయని అనుమానించారు.
అక్కడినుంచి వాళ్ళు జరిపిన పరిశోధన కొత్త పుంకలు తొక్కాయి. రోగం ఏమిటో తెలిసింది. కానీ దానికి మందు లేదు. ఇప్పుడా పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఆ కొత్త మందు కనుక్కుంటే కరోనా మందులా హాట్ హాట్గా అమ్ముడుపోతుందని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ని అతిగా వాడే వాళ్ళ సంఖ్యా 80 శాతానికి మించే ఉంటుంది అని వాళ్ళ నమ్మకం. జాగ్రత్తా! మీరు సెల్ ఫోన్ని తక్కువ మోతాదులో వాడండి.
౦౦౦