తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరిక విషయంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన నిర్వహించే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో టి. సర్కార్ అనుకూలంగా వ్యవహరిస్తామని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపినట్టుగా అర్థం అవుతోంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరిక నాలుగు వేల కోట్లతో కూడినదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.
ఐఎఎస్ ఆఫీసర్ అయిన తోట చంద్రశేఖర్ వీఆర్ఎస్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. తన కుమారులతో కలిసి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. అయితే.. ఈ కంపెనీకి మియాపూర్‌లో 40 ఎకరాల భూమిని కేటాయించారట. దీని వెనుక నాలుగు వేల కోట్లని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొనుగోలు చేశారు. ఆ భూములపై వివాదం నడుస్తోంది. ఆ భూముల విషయంలోనే బిజినెస్ మెన్ సుఖేష్ గుప్తా ఎనిమిది ఎకరాలు కొంటే అది ప్రభుత్వ భూములని కలెక్టర్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. కానీ తోట చంద్రశేఖర్ కొనుగోలు చేసిన భూములపై ఎస్ఎల్పీ దాఖలు చేయలేదు. ఇలా ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని రఘునందన్ ప్రశ్నిస్తున్నారు.
తోట చంద్రశేఖర్ కు కేటాయించిన 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చున్నారని విమర్శించారు రఘునందన్. మియాపూర్ భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు.
రఘునందన్ రావు తోట చంద్రశేఖర్ పై చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను కింద చూడొచ్చు..