కేసీఆర్ రాజకీయాన్ని అంచనా వేయలేని కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు నిట్టూరుస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు కొనసాగుతుందని మునుగోడు బైపోల్ టైంలో ప్రకటించిన కేసీఆర్ తాజాగా ఏకపక్షంగా ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చారు. దీనిని కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర అవమానంగా భావిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక కోసమే తమను కేసీఆర్ వాడుకొని వదిలేశారని… ఇప్పుడు తమను కనీసం పిలిచి కూడా మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ చేసిన మిత్ర మోసానికి వామపక్ష పార్టీలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. బీఆర్ఎస్ కు తామంటే ఏమిటో చూపించాలని కసి, కసిగా ఉన్నారు కమ్యూనిస్టులు. ఈమేరకు హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికల వ్యూహంపై , బీఆర్ఎస్ ఇవ్వాల్సిన మాస్టర్ స్ట్రోక్ పై చర్చించాయి. కేసీఆర్ ను ఓడించి తీరాలనే టార్గెట్ గా తదుపరి రాజకీయ వ్యూహాలు ఉండాలని తలంపుతో ఉన్నాయి సీపీఐ అండ్ సీపీఎం. మునుగోడులో గట్టెక్కాలనే ఏకైక ఎజెండాతో కేసీఆర్ నాడు పొత్తు పెట్టుకున్నారని ఇప్పుడు అర్థమై సమాలోచనలు ప్రారంభించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తో జట్టు కట్టడం ఉత్తమమనే భావనతో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీల నేతలు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలకు భారీ ఓటు బ్యాంక్ ఉంది. దాంతో ఈ రెండు జిల్లాలో కాంగ్రెస్ తో జట్టు కట్టి బీఆర్ఎస్ కు ఓటమి దెబ్బ రుచి చూపించాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్ళాలనే తలంపుతో ఉన్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో..!
Also Read : కేసీఆర్ ను తలదన్నేలా పట్నం మహేందర్ రెడ్డి వ్యూహం..!?