ఎమ్మెల్యే కొడుకు రేప్ కేసులో ఉన్నాడు అంటాడు కాని వాడి పేరు చెప్పడు రఘునందన్ రావు.
అక్కడ అత్యాచారం జరిగింది అంటూనే కేసును తప్పుదోవ పట్టించేందుకు mutual kiss ఫోటోను వైరల్ చేస్తాడు.
పింక్ సినిమా చూసాం కదా. NO means NO అని. ఆ అమ్మాయి ఒంటిమీద గాయలున్నాయని కదా పోలీసుల, అమ్మాయి తండ్రి కథనం. కారు మార్చి తనపై బలవంతం చేశారని కదా ఫిర్యాదు. A kiss is not an invitation for sex. ఈ కాలం అమ్మాయిలకు, అబ్బాయిలకు ఈ విషయం బాగా తెలుసు.
అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటో రోడ్డెక్కిన మనుషులపై కుక్కలను వొదులుతారు ఫ్రెండ్లి పోలీసులు. పిలిస్తే రాలేదని కాళ్ళూ విరగ్గొడతారు.
KTR నిర్భయ కేసు నిరసనల వెనుక పెల్లుబికిన ప్రజాగ్రహంలో అన్ని పార్టీలు ఉన్నాయి. కాని, కాంగ్రెస్ ఆ నిరసనలపై చేసిన దాడి బీజేపీ కి ప్లస్ అయింది. దానికి తోడు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు. ఇప్పుడు తెలంగాణలోనూ సేమ్ మోడస్ ఆపరెండి.
మీ పార్టీకి అధికారం ఎంత అవసరమో మాకవసరం లేదు. కాని, తెలంగాణ సమాజం మరో యూపీ, బీహార్ కావడం మాకు అవసరం లేదు. ఇక్కడ రోజుకో దళితుడి హత్య, ముస్లిం మోహల్లాలపై దాడులు చూసేందుకు మేము సిద్ధంగా లేము. విక్టిమ్ షేమింగ్ చేస్తున్న ఫొటోలూ, వివరాలు బయట పెట్టిన రఘునందన్ రావు మీద కేసు పెడతారా? కులం వాడని వొదిలేస్తారా?
“ఈ కేసులో నిందితుల దగ్గర రఘునందన్ రావు డబ్బులు తీసుకుని కేసును పక్కదోవ పట్టిస్తున్నాడని ఆరోపణ. పోలీసులూ ఓ ఎమ్మెల్యే కొడుకును తప్పించారనీ ఆరోపణ.” వాటిని నివృత్తి చేయాల్సిన భాద్యత ప్రభుత్వానిదే.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొడుతుంటే సస్పెండ్ చేయమని వాళ్ళ పార్టీని అడిగే బదులు సంబంధిత ఐపీసీ సెక్షన్ల ప్రకారం మీరే కేసులు పెట్టి అరెస్ట్ చేయచ్చు కదా. న్యాయం అడిగే వాళ్ళ మీద కేసులు పెట్టేందుకు, ఇళ్ళమీద దాడులు చేసి మావోయిస్టు ముద్ర వేసేందుకు, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దళితులను చిత్రహింసలు పెట్టేందుకే చట్టం పనికొస్తోందా?
★ విద్యార్థుల మీదకు కుక్కల్ని వొదిలిన పోలీసులను సస్పెండ్ చేయాలి.
★ యువకుడ్ని కొట్టిన పోలీసులను విధుల నుండి తొలగించాలి.
★ ఫ్రెండ్లి పోలీసింగ్ అని మాటలు చెప్పడం కాదు. ఆచరణలో చూపించాలి.
★ బాధితుల పక్షాన పోరాడుతున్న పీఓడబ్లు సంధ్య, దేవీలపై జరుగుతున్న ట్రోలింగ్ ని అరికట్టాలి. వారిపై బూతు దాడి చేస్తున్న వారిని అరెస్టు చేయాలి.
★ ఈ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ లాంటి ఇండిపెండెంట్ జ్యూడిషయల్ కమిషన్ ని వేయాలి.