బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరికొంతమంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన బీఆర్ఎస్ , బీజేపీ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానికం ఠాకూర్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు.
మాజీ ఎమ్మెల్సీ , బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ , మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి , వేముల వీరేశంతోపాటు గద్వాల జడ్పీ చైర్మన్ సరిత, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి , బీఆర్ఎస్ తిరుగుబాటు నేత మందుల సామేలు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. గురువారం ఏఐసీసీ అద్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో చేరనున్నారు.
వాస్తవానికి వీరంతా కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ లో చేరేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు కానీ వాతావరణ పరిస్థితుల కారణంగా సభను వాయిదా వేశారు. దాంతో కాంగ్రెస్ లో చేరాలనుకున్న నేతలంతా ఢిల్లీ వెళ్లి అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరేలా ఏర్పాట్లు చేశారు.
Also Read : హరీష్ రావుతో కొత్త పార్టీ దిశగా కేసీఆర్..?