భూమధ్య రేఖలో ఉన మద దేశంలో 40 డిగ్రీల వేడి ఉంటేనే శరీరం మన మాట వింటుంది. వేడి తగ్గితే వచ్చే వ్యాధుల కంటే పెరిగితే వచ్చే వ్యాధులే ఎక్కువా. అయితే మన తెలుగు రాష్ట్రాలల్లో 40 డిగ్రీల వేడి దాటింది. కాబట్టి మీకు ఈ 5 రకాల వ్యాధులు రావడానికి సిద్దంగా ఉన్నాయి. దీనిని ఈ మధ్యనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (హూ) ప్రకటించింది.
రోజురోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీనికి కారణం శరీరం లోపల ఉష్ణోగ్రత పెరిగితే శరీరంలోని జీవక్రియ ప్రభావితమవుతుంది. ఉష్ణోగ్రత సాధారణానికి మించి ఉంటే శరీర సామర్థ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీనివల్ల హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్, హైపెథెర్మియా ప్రమాదం పొంచివుంటుంది. ఆ 5 రకాల వ్యాధులు ఇవే.
ఒకటి – శ్వాస కొస సంబందిత వ్యాధులున్న వాళ్లకు ఈ వేడి తాపం పెనం మీద కుర్చోపెట్టినట్లు చేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు బాధలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
రెండు – గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళ బిపి పెరుగుతుంది. అది అడుపుతప్పితే గుండె నొప్పి రావచ్చు. హార్ట్ అట్టాక్ లు ఎక్కువగా ఎండా కాలం వస్తాయి అని గమనించ గలరు.
మూడు – మూత్రపిండాలు సమస్యలు మొదలవు తాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడితే అది ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.
నాలుగు – మానసిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. మానకిక వికలాంగుల ప్రవర్తన విపరీతంగా పెరుగుతుంది. కొంచం రోగంలో ఉన్నవాళ్ళకు ఇది పెరిగే అవకాశం ఉంది.
ఐదు – మధుమేహం ఉన్నవాళ్ళకు ఏ చిన్న దెబ్బ తగిలినా తొందర మానదు. ఏ చిన్న దెబ్బ తగిలినా రక్త స్రావం ఎక్కువగాపోతుంది. పుండు అంత తొందరగా మానదు.
నివారణ చర్యలు ఏమిటి?
వీటికి మందులు లేవు. జాగ్రత్తగా ఉండడమే నివారణ చర్యలు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు పగటిపూట 32 డిగ్రీల కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి. రాత్రివేళ 24 డిగ్రీలవద్ద స్థిరంగా ఉండాలి. రాత్రివేళల్లో కిటికీలు తెరిచి వుండటంతోపాటు విద్యుత్తును నిలిపివేయాలి.
రోజుకు కనీసం 2 నుంచి 3 గంటల పాటు చల్లని ప్రదేశాలలో ఉండాలి. వీలైనంతవరకు బయటకు వెళ్లడం మానుకోవాలి. పట్ట పగలు ఇంటి పట్టునో, ఆఫీసులోనో ఉండాలి. వ్యాయామం ఉదయం పూటే పూర్తి చేయాలి. తేలికపాటి, గాలి ఆడే బట్టలు ధరించాలి. నిద్ర పోవడానికి నవరా మంచం వాడాలి. లేదా దూరి పరుపులు వాడాలి. కానీ స్పాంజ్ తో చేసిన కుషన్ పరుపులు అస్సలు వాడరాదు. అవి మీ వేడిని నాలుగు రెట్లు పెంచుతుంది.
ముఖ్యంగా నీళ్ళు, జూస్లు తరచూ తాగాలి. ఇవి నిప్పుల మీద నీళ్ళు చల్లినట్లు మీ వేడిని తగ్గిస్తుంది. కాబట్టి బయటికి వెళ్ళినా, బయటినుంచి తిరిగి వచ్చినా రోజుకు కనీసం 6 లీటర్ల మంచి నీళ్ళు తాగాలి. ఫ్రీజు నీళ్ళు తాగొద్దు. ఐసు ముక్కలు తినొద్దు. ఐసు ముక్కలు ఎందులోనూ కలుపుకుని తాగొద్దు. కొబ్బరి బొండం మరీ మంచిది.