మెడికో ప్రీతి కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది. ఆమెను మొదట వరంగల్ ఆసుపత్రికి తరలించాక ప్రీతీ నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. తాజాగా ఆ టాక్సీకాలజీ రిపోర్టులు వరంగల్ సీపీ రంగనాథ్ కార్యాలయానికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఆమె రక్తం, గుండె, కాలేయంతోపాటు ఇతర శరీర భాగాల్లో విష పదార్థాల ఆనవాళ్ళు లేవని టాక్సీకాలజీ రిపోర్ట్ లో తేలినట్లు తెలుస్తోంది. ప్రీతి శరీర భాగాలలో ఎక్కడ పాయిజన్ పదార్థాలు లేవని తెల్చినట్లు సమాచారం. దీంతో ప్రీతిది ఆత్మహత్య కాదు. హత్యా అనే అనుమానాలకు తాజాగా బయటకొచ్చిన రిపోర్ట్ లతో బలం చేకూరుతోంది.
ఇప్పటికే ప్రీతి సంఘటనలో అనేక అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పైగా.. సంఘటన స్థలంలో కూల్ డ్రింక్స్, లెస్ ప్యాకెట్లు ఉండటం కూడా పలు అనుమానాలకు తావించింది.
ఇప్పటివరకు ఆమె మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుందని అనుకున్నప్ప్పటికీ… ఆమె శరీర భాగంలో ఎక్కడ కూడా విష పదార్థాల ఆనవాళ్ళు లేవని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయ్. దీంతో ప్రీతీది హత్య అని అంటున్నారు. ఇప్పుడు ఈ కోణంలో పోలీసులు విచారణ చేయనున్నారు.
Also Read : ప్రీతి కేసు – సంఘటన స్థలంలో ఆ వస్తువులు ఎందుకున్నట్లు..?