జాతకాలూ ఉన్నాయో లేవో తెలియదు. అదృష్టం, దురదృష్టం అనేవి ఉన్నవో లేవో కూడా తెలియదు. కానీ కొందరి జీవితాలు చూస్తుంటే అవి ఉన్నాయి అనిపించక తప్పదు. అందులో నందమూరి తారకరత్న మొదటివరుసలో ఉన్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ కి కొదవలేదు. ఎన్ టి రామారావు మనవడు. పుట్టకతో బంగారు కంచంతో పుట్టాడు. ఆరడుగ అందగాడు. అద్బుత నటుడు. మంచి డాన్సర్. క్రమ శిక్షణకు మారు పేరు. సినిమా పారిశ్రామ మొత్తం అతని ఇంటి చుట్టే తిరుగుతుంది. పేరుకే తారకరత్న కాదు. నిజంగానే అతను ‘రత్నం’.
అతను సినిమా రంగంలోకి అడుగుపెట్టగానే అతని అందం, ఆహార్యం, నటనా వారసత్వం, క్రమశిక్షన చూసి దర్శకనిర్మాతలు ఇంటిముడు లైన్ కట్టారు. ఒకే రోజు తొమ్మిది సినిమాల ముహూర్తం జరిగాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి సంఘటన లోగడ జరలేదు. ఆ సినిమాలు బాగున్నాయి అని ప్రశంసలు అందాయి. ఎన్ టి రామారావు నటన వారసుడు వచ్చరు అని అందరు ముక్తకంతంతో మెచ్చుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 22 సినిమాల్లో నటించారు. అన్నీ ఉన్నా ఒక్క అదృష్టం మాత్రం లేదు. ఒక్క విజయం కూడా అతనిని వరిచలేదు. ఒక్క విజయం కోసం అతను పోరాటం చేయని రోజు లేదు. కానీ దురదృష్టమే అతని మీద విజయం సాధించింది.
అపజయం అతనిని వెక్కిటించింది. నిరాశ అతనిని కృంగ దీసింది. పడిలేచే కడలి తరంగంలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. కానీ ఆకాశాన్ని అందుకోలేకపోయారు. అతనిని పుట్టుకతో వెంటాడే దురదృష్టం నిత్యం వెక్కిరించింది. అతను ఒక్క అడుగు ముందుకు వేస్తే – అతని దురదృష్టం నాలుగు అడుకుగు ముందు ఉండేది.
హీరో వేషాలు రాకపోయినా విలన్ వేషాలు వేశారు. అయినా దురదృష్టమే విజయం సాధించింది. చివరికి మంచి క్యారెక్టర్ దొరికితే వేయడానికి సిద్దపడ్డారు. కానీ అవకాశాలు రాలేదు. రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అతనికున్న క్రమశిక్షణ, కష్టపడే లక్షణాలను చూసిన నారా చంద్రబాబునాయుడు భుజం తట్టారు. అలాంటి యువ నిజాయితీపరులు పార్టీకి అవసరం అని మెచ్చుకున్నారు. నారా లోకేష్ చేపట్టిన ‘ యువగళం’ లో చేరమని పెద్దపేట వేశారు.
తారకరత్న అందులో పాల్గొని నాలుగు అడుగులు ముందుకు వేయాలి అనుకున్నారు. కానీ మళ్ళి అతని దురదృష్టం ఎనిమిది అడుగులు ముందుకు వేసింది. అతని గుండెను నులిమింది. అప్పటివరకు ఎలాంటి జబ్బులు లేని అతనిని కుప్పగా కూల్చింది. అతని భవిష్యత్తుని సర్వనాశనం చేస్తూ మాయదారి జబ్బు అంటగట్టింది. అతనిని కాపాడుకోడానికి మొత్తం నందమూరి వంశమే కాదు, అతని అభిమానులు, డాక్టర్లు చేయని కృషి లేదు.
ఆసుపత్రిలో అతను తను మృత్యుతో పోరాడారు. ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, 22 రోజులు. అతనికి ఈ 22 అంకె కలిసిరానట్లు ఉంది. చివరికి ఆ పోరాటంలో అలసిపోయాడు. నువ్వే గెలిచావ్ పో అని దురదృష్టంభుజం తట్టాడు. అది కూడా కేవలం 39 ఏళ్పల వయసులో. అతను పడి లేచే కడలి తరంగంలా ఎప్పటిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. కానీ ఈసారి ఆకాశాన్ని అందుకున్నారు. ఆ చుక్లలో దృవతారలా వెలిగిపోతున్నారు. అందరిని ఏడిపిస్తూ, ఈ అనంత లోకానికి సెలవు చెప్పారు. అతని క్లైమాక్స్ అందరి గుండెలను గాయం చేసింది.
కొందరి జీవితాలు అంతే! చేయని తప్పుకు బాధపడతారు. తారకరత్న జీవితం కూడా అంతే! అవతార పురుషుడు రాముడికి కూడా ఇలాంటి దురదృష్టం తప్పలేదు. రాముడు గొప్ప వంశంలో పుట్టిననా సీతలో పద్నాలు గేళ్ళు కారడవిలో గడిపారు. రావణుడు సీతను ఎత్తుకుపోయాకా విరహం చవిచూశారు. చివరికి గర్భవతిగా ఉన్న సీతను అడవుల పాలు చేశారు. ఒంటరి జీవితం గడిపారు. సొంత కొడుకులు లవకుషులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. చివరికి సీత భూమాత ఒడిలో చేరిపోగా మళ్ళి ఏకాకిగా మిగిలారు. ఇందులో రాముడు చేసిన తప్పేమిటి? లేదు. కొన్ని అంతే. మనం చేయని తప్పులకు శిక్షలు అనుభవించక తప్పదేమో!??