అధికారం అహంకారాన్ని బిపి లా పెంచుతుంది. కానీ ఆ బిపి ఎదోఒకరోజు ప్రాణం మీదికి తెస్తుంది అని బిజెపికి నేడు తెలిసింది. మోడీ ప్రాణ మిత్రుడు గౌతమ్ అదాని చేసిన దేశంలోని అతి పెద్ద ఆర్థిక కుంభకోణం మీద విచారణ జరపాలని సుప్రీం కోర్ట్ మొన్న ఆదేశించి గట్టిగానే మొట్టికాయలు వేసింది. అయినా తన తెలివి తేటలు చూపిన ప్రధాని మోడీ తనకు అనుకూలంగా పనిచేసే నిపుణులతో ఓ కమిటీ వేసి, దానిని సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీం కోర్టుకు పంపారు.
మోడీ ఎలాంటి వాళ్ళను నియమిస్తారో ముందే ఊహించిన సుప్రీం కోర్ట్, ఆ సీల్డ్ కవర్ని కనీసం తెరవకుండానే తిరస్కరించింది. దొంగను పట్టుకోమని పిక్ ప్యాకేటర్ ని నియమించినట్లు ఉన్నదని ఎద్దేవ చేసింది. ఇది భారతీయ న్యాయ వ్యవస్థలోనే ఓ సంచలనం. ఓ కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు మించిన అవమానం, పరిపాలనా వైఫల్యం మరొకటి లేదు.
బిజెపి ఇక్కడో నగ్నసత్యాన్ని తెలుసుకోవాలి. మానవత్వం తల్లి. మతం తండ్రి . తండ్రి ఇంటికి పెద్ద దిక్కే కావచ్చు. కానీ ఆ తండ్రి తాగుబోతుగా, తిరుగుబోతుగా, జూదగాడిగా మారితే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇస్లామిక్ మతంలో కూడా కొందరు మతోన్మాదులు ‘జిహాద్’ పేరుతో తీవ్రవాదులుగా మారి ఆ మతానికి మాయని మచ్చ తెచ్చారు.
ఇప్పుడు బిజెపి వల్ల హిందువులకు అలాంటి మాయని మచ్చ వచ్చేలా ఉంది. హిందూ సనాతన ధర్మాలను కాపాడుతూ, మతం సర్వతో ముఖాభివృద్ది చెందేలా బిజెపి కృషి చేయడం మంచిదే. కానీ ఆ వంకతో అక్రమాలకు పాల్పడితే మతం పరువు పోతుంది. మోడీకి మొదటినుంచి హిందువుల పట్ల, తన గుజరాతీ జాతి మీద మక్కువ ఎక్కువే. తప్పు లేదు. పిట్ట పిల్ల పిట్టకు ముద్దు – కాకి పిల్ల కాకికి ముద్దు.
కానీ ఇది మన హిందువుల దేశం, మీకు దొరికినంత దోచుకొ అన్నట్లు నేరస్తులను ప్రోత్సహించడం బిజెపి పద్దతి. మీరు గమనించారా – కాంగ్రెస్ పాలనలో బహుద్ ఇబ్రహీం, ఒసామా బిన్ లాడెన్ లాంటి హిందూయేతర నేరస్తుల పేర్లు అంతర్జాతీయంగా వినిపించేవి. కానీ బిజెపి పరిపాలలో విజయ్ మాల్యా, నిరవ్ మోడీ, గౌతమ్ అదాని లాంటి హిందువుల పేర్లు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడున్న టాప్ 20 వైట్ కాలర్ నేరస్తులల్లో ఎక్కువమంది హిందువులే ఉన్నారు. ఇస్లామిక్ పరువు ప్రతిష్టలు ఎలాగైతే మసకబారయో ఇప్పుడు హిందువుల పరువు ప్రతిష్టలు కూడా మసకబారేలా ఉన్నాయి. ఇది దేనికి సంకేతం? మన హిందుత్వం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? మన పరువు అంతర్జాతీయంగా పాడవుతుంటే దానిని భాద్యులు ఎవరు?
మేము హిందువుల సేవ చేస్తున్నాము, మమ్మలి ఎవ్వరు ఏమి చేయలేరు అని కమలం తన మురికిలో వికసిస్తుంటే సుప్రీం కోర్టు ఎందుకు ఉరుకుంటుంది? ప్రజలు దీనిని మెచ్చునంటారా? తండ్రి దొంగతనం చేసి అన్నం పెడితే – పిల్లలు మెచ్చుకోరు.