ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో తాడో పేడో త్వరగా తేల్చాలని జగన్ వేసిన పిటిషన్ని సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఇప్పటికే ‘అమరావతి’ మీద రైతులు వేసిన కేసులు కుప్పలు తెప్పలుగా పడున్నాయి.
‘రాజధాని విషయాన్ని అంత తొందరగా ఎలా తెలుతుంది? ఒక కేసు విచారించకుండా మరో కేసును ఎలా విచారిస్తారు? ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. ఇలా తొందరపడితే ఎలా?’ అని సుప్రీం కోర్ట్ మంగళవారం జగన్ కి మొట్టికాయలు వేసినట్లు తెలిసింది. జస్టిస్ కే ఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మానసం ఈ కేసుని విచారించింది. తిరిగి ఈ కేసుని జూలై 11న దీనిని విచారిస్తారు.
కానీ ఇది జగన్ సర్కార్ మింగుడు పడని అంశం. ఒక రాష్ట్రం రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు లోగడ ఇచ్చిన తీర్పు తెలిసిందే. ఇది తప్పని, మా రాజధానిని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు అని, దీని మీద స్టే ఇవ్వాలని స్పెషల్ లీవ్ పిటిషన్ ను వైసీపీ దాఖలు చేసింది. హై కోర్టులో తీర్పుని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో మరి కొన్ని కేసు వేసింది.
ఈ కేసు ఎంత ఆలస్యం అయితే అంతమంచిదని చంద్రబాబు నాయుడు ఎదురుచూస్తున్నారు. అమరావతి రాజధాని అంశం అతనికి కల్పవృక్షం లాంటిది. రాబోయే ఎన్నికలలో దీనిని అడ్డంగా వాడుకుని అడ్డదారిలోనైన అధికారంలోకి రావాలని ఎదురుచూస్తున్నారు.
సుప్రీం కోర్ట్ ఒకవేళ ఈ హై కోర్ట్ తీర్పును కొట్టివేసినా, దానిని మీద స్టే ఇచ్చినా జగన్ రాబోయే ఎన్నికలలో తనకు అనుకూలంగా మలుచుకుంటారు. అయితే అది ఎన్నికల సర్వే రిపోర్ట్ కు అనుగుణంగా పావులు కదుపుతారని తెలిసింది. ఇకనుంచి జగన్ సర్కార్ డబుల్ గేమ్ ఆడాలని చూస్తోంది.
మొన్నటివరకు మూడు రాజధానులు కడతాము అని గొంతు ఎత్తి చాటారు జగన్. కానీ ఆ నినాదం అతనికి అస్సలు కలిసిరాలేదు. మొన్న జరిగిన ఎమ్మెల్సి ఎన్నికలల్లో విశాక, జగన్ సొంతజిల్లా లోనే ఘోర పరాభవం పొందారు. ఇప్పుడు ఆయన గొప్ప సందిగ్డలో పడ్డారు. మాచెడ్డ చిరాకుతో ఉన్నారు.
ఒకవేళ ఇప్పుడు అమరావాతే మన ఏకైక రాజధాని అని ‘యూ’ టర్న్ తీసుకుంటే జగన్ మాట తప్పినవాడు అవుతారు. దీనిని చంద్రబాబు నాయుడు అడ్డంగా వాడుకుని జగన్ని అడుగడునా ఎద్దేవచేస్తారు. లేదా, మళ్ళి మూడు రాజధానుల నినాదంతో వెళ్ళితే అసంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే చేదు ఫలితాలు రావచ్చు.
అందుకే మూడు రాజధానుల విషయంలో జగన్ ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ అంశం మీద ఎవ్వరు మాట్లాడరాదు అని ఆయన తన నాయకులను గట్టిగానే మందలించినట్లు తెలిసింది. అందుకే జగన్ కు ఇప్పుడు ముందు నుయ్యి, వెంక గొయ్యిలా మరిదిని ఈ రాజధాని అంశం.
ఒకవేళ సుప్రీం కోర్ట్ అమరావాతే రాజధాని అని తీర్పు చెపితే దానిని కూడా జగన్ ఇంకా తెలివిగా వాడుకుంటారు. ఈలోగా వచ్చే సర్వే రిపోర్ట్ లను బట్టి గోడ మీది పిల్లిలా మాట్లాడుతారు. మూడు రాజధానుల పట్ల ప్రజలు ఆసక్తిగా లేదు అని సర్వే రిపోర్ట్ వస్తే చాలు. సుప్రీం కోర్ట్ ఆదేశం మేరకు అమరావాతే మన రాజధాని అని స్వరం తగ్గిస్తారు. ఒకవేళ మూడు రాజధానుల పట్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారు అని సర్వే రిపోర్ట్ వస్తే చాలు. మళ్ళి మూడు రాజధానుల స్వరం ఎత్తుకుంటారు.