సచిన్ టెండూల్కర్..క్రికెట్ దేవుడు. క్రికెట్ కు ప్రపంచస్థాయి వన్నె తీసుకొచ్చాడు. బ్యాటింగ్ లో సచిన్ కొట్టే షాట్లు ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కానివిలా ఉంటాయి. కళాత్మకంగా ఉంటాయి. ప్రత్యేకమైన శైలితో బ్యాటింగ్ చేసే సచిన్ ఎంతోమంది యంగ్ క్రికెటర్లకు స్ఫూర్తి. క్రికెట్ లో ప్రతి ఒక్కరు సచిన్ కావాలని అనుకుంటారు. కానీ సచిన్ ను మించిన బ్యాట్స్ మెన్ ఉన్నాడని మనలో ఎంతమందికి తెలుసు. వెలుగులోకి రాని ఆ లెజెండరీ బ్యాట్స్ మెన్ నే సచిన్ ఇన్‌స్ప్రేషన్ గా తీసుకున్నారు. అంత గొప్ప క్రికెటర్ ఎందుకు వెలుగులోకి రాలేదు..? అనేగా మీ సందేహం.
సచిన్ ఇన్‌స్ప్రేషన్ గా తీసుకున్న క్రికెటర్ పేరు అనిల్ గౌరవ్. ఆయన గురించి ఎవరో చెప్పలేదు సచినే తన డైరీలో రాసుకున్నాడు. అతను క్రికెట్ కు దూరం కావడానికి సచిన్ రాసుకొచ్చిన కథనం చదివితే కళ్ళు చెమర్చక మానవు. అనిల్ గౌరవ్, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ.. ఈ ముగ్గురు క్రికెట్ లో సమకాలీకులు. వీరి కోచ్ రమాకాంత్ అచ్రేకర్. ఈయనకు ప్రియ శిష్యుడు సచిన్ అనుకుంటారు కానీ, సచిన్ కంటే మెరుగ్గా బ్యాటింగ్ చేసే అనిల్ కే అచ్రేకర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అనిల్ బ్యాటింగ్ శైలి చూపిస్తూ సచిన్ మరియు వినోద్ కాంబ్లీలకి క్రికెట్ ఎలా ఆడాలో నేర్పేవాడు అచ్రేకర్. అందుకే వారిద్దరూ అనిల్ ను చూస్తూ ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్చుకునేవారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ బ్యాటింగ్ కు వెళ్తుంటే స్టేడియం ఎలా మారుమోగిందో అప్పట్లో అనిల్ బ్యాటింగ్ కు వెళ్ళే సమయంలో అనిల్.. అనిల్ అంటూ మారుమోగేది. కోచింగ్ తీసుకుంటున్న సమయంలో అనిల్ గౌరవ్ తల్లి వస్తే అచ్రేకర్ గొప్ప క్రికెటర్ అవుతాడని ఆమెకు చెప్పాడు. ఇవన్నీ సచిన్ తన ఆటో బయోగ్రఫీలో రాసుకున్నవే.
అంత ప్రతిభ కల్గిన అనిల్ నేడు దయనీయ స్థితిలో ఓ స్లం ఏరియాలో ఉంటున్నాడు. మద్యం, డ్రగ్స్ కు బానిసై అందమైన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప క్రికెటర్ గా ఉండాల్సిన అనిల్ కెరీర్ పూర్తిగా మారిపోవడానికి ఆయన సోదరుడే అజిత్ కారణం. ఆయన వల్లే అనిల్ లో క్రికెట్ పై ఆసక్తి చచ్చిపోయింది. అమితంగా ప్రేమించిన క్రికెట్ కు దూరం చేసింది.
అనిల్ సోదరుడు అజిత్ పేరుమోసిన క్రిమినల్. ఆయనపై హత్యారోపణలు ఉన్నాయి. ముంబైలో ఎదో ఒక హత్య జరిగిన ప్రతిసారి అజిత్ తప్పించుకొని పారిపోయేవాడు. అజిత్ కోసం పోలీసులు వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవాళ్ళు. పోలిసుల వేధింపులు, దెబ్బలకు తాళలేక అనిల్ మద్యంకు బానిస అయ్యాడు. సిగరెట్ లు లేకపోతే పిచ్చెక్కిన వాడిలా చేసేవాడు. సిగరెట్ కు పైసలు లేకపోతే రోడ్డుపక్కన తాగి పడేసిన సిగరెట్ ను తాగేవాడు. దీనికంతటికీ అనిల్ సోదరుడు అజితే కారణం. అలా క్రమంగా అనిల్ కు క్రికెట్ పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది.
ఆఖరికి గల్లీలో పిల్లలతో రూపాయి, రెండు రూపాయల బెట్టింగ్ పెట్టి క్రికెట్ ఆడేస్థాయికి దిగజారాడు అనిల్. హైలీ టాలెంటెడ్ అయిన అనిల్ అలా మారుతుంటే చూడలేక కోచ్ అచ్రేకర్ ఒకరోజు అనిల్‌ను పట్టుకుని అడిగితే, ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల కంటే గల్లీలో ఆడే క్రికెట్‌లోనే కిక్కు ఉందని చెప్పాడట. వీటన్నింటిని సచిన్ తన డైరీలో రాసుకున్నాడు.
Also Read : దటీజ్ రవీంద్ర జడేజా