బిఆర్ఎస్ ప్రభుత్వానికి ‘రైతుబంధు’ ఓట్ల తింపెట్టిన కల్పతరువు. ఇప్పటివరకు ఆ పార్టీ గెలవడానికి కారణం కూడా ఈ పథకమే. ఇప్పుడున్న ఆర్థిక లోటువల్ల ఈ పథకంలో కెసిఆర్ కోత పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చిన్నరైతు, మోతుబరి రైతు అనే తేడా లేకుండా అందరికి ‘రైతుబంధు’ డబ్బులు బ్యాంక్లో వేశారు. కానీ ఇప్పుడు 11 ఎకరాల కంటే ఎక్కువ భూములున్న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడం లేదు. ఇప్పటివరకు 5 ఎకరాలు, అంతకంటే తక్కువున్న భూములున్న రైతుల ఖాతల్లోకి డబ్బులు వచ్చాయి.
11 ఎకరాల కంటే ఎక్కువ భూములున్న రైతులను ‘మోతుబరి’ రైతులుగా గుర్తించారు. వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం అవసరం లేదని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మోతుబరి రైతులకు చిల్లి గవ్వ అందలేదు. ఈ విషయం సంబంధిత అధికారులు చెప్పకుండా కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు.
ఇప్పటివరకు ‘రబీ’ సీజను డబ్బులు కూడా సన్నకారు రైతులకు అందలేదు. పేద రైతులు, పెద్ద రైతులు బ్యాంకుల చుట్టూ, స్టానిక ఏమ్మేల్లెల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ విధానంలో మార్పులు చేర్పులు అన్నది సర్వసాధారణం. కానీ కెసిఆర్ మొన్నటివరకు ఈ పథకం గురించి గొప్పలు చెపుతూ ”నా బొందిలో ప్రాణం ఉండగా ఈ ‘రైతుబంధు’ పతాకంలో ఒక్క మార్పు కూడా ఉండదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఈ పథకాన్ని యదావిదంగా కొనసాగిస్తాను” అని మాటిచ్చారు. మరి మాట తప్పడం ఏమిటని రైతులు నిలదీస్తున్నారు.
Also Read: మహిళా నేతపై లైంగిక దాడి జరిగితే స్పందించని బండి…నువ్వో లీడర్ వా..?