ఈ సృష్టిలో అత్యంత కృరమృగం ఏదో తెలుసా? అని అడగగానే టక్కున చెప్పేది పులి లేదా సింహం. కానీ దానిని మించిన కృరమృగం మనిషి అని నోబెల్ గ్రహీత దలైలామా ఓ సందర్భంలో అన్నారు. అది నిజమే. ఏ మృగమైనా ఆకలి వేస్తేనే, ఇక తప్పదు అనుకున్నప్పుడే వేటాడి శాకాహార జంతువుని చంపుకు తింటుంది. శాకాహార జంతువులంటే మాంసం తినకుండా కేవలం గడ్డి, ఆకులు, అలములు తినే జింకలు, ఆవులు, గుర్రాలు, గాడిదలు, కుందేళ్ళను మాత్రమే తింటుంది. కానీ మాంసం తినే నక్కలు, కుక్కలు, తోడేళ్ళును చంపుకుతినవు.
కానీ మనిషి దేనిని వదిలిపెట్టాడు. అన్నిటిని తింటాడు. దీనికి చక్కటి ఉదాహరణ – ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పులి కరెంట్ తీగను తొక్కి ప్రాణం వదిలింది. అక్కడి గ్రామస్తులు ఆ విషయాన్ని అటవీ శాఖకు చెప్పలేదు. కనీసం మానవత్వంతో దాన్ని పాతి పెట్టలేదు. ముందుగా దాని చర్మాని ఒలిచారు అమ్ముకోడానికి. దాన్ని గోళ్ళు కత్తిరించారు. అప్పటికీ దానిని వదిలిపెట్టలేదు. ఏకంగా మేకను కోసినట్లు ముక్కలు ముక్కలుగా కోసి శుబ్బరంగా వండుకుని తిన్నారు. తాగి తందానాలు ఆడారు.
ఆ తర్వాత అసలు కథ మొదలయింది. అసలే మానవ మృగాలుగా. పులి గోళ్ళ పంపకాలలో తేడాలు వచ్చి తాగిన మైకంలో కొట్టుకున్నారు. కొందరు వెళ్లి పోలీసులకు విషయం చెప్పారు. దాంతో అటవీశాఖా అధికారులు రంగంలోకి దిగి 12 మందిని అరెస్ట్ చేశారు. పులి ఎముకలను, పులి అడుగుజాడలను తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళను కటకటాల పాలు చేశారు.
ఇది చైనాలో జరిగితే ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్లు ఎలుకలను, పాములను చివరికి గబ్బిలాలను కూడా తింటారు. ఈ ప్రపంచంలో గబ్బిలాలను తినే ఏకైక జాతి- మానవ జాతి ఒక్కటే. ఎందుకంటే అది విడుదల చేసే కరోనా లాంటి విషపూరిత బ్యాక్టిరియాకు భయపడి ఏ ప్రాణి కూడా తినదు. కానీ మనిషి దానిని కూడా వదలకుండా తిని, ప్రపంచ వ్యప్తంగా కరోనా అంటగట్టాడు.