బిఆర్ఎస్ పార్టీ జాతీయస్టాయిలో గెలవాలంటే ముస్లింల ఓట్లు ఎంతో కీలకం. లోగడ కాంగ్రెస్ కి రిజర్వు లో ఉన్న ఈ ఓట్ల మీద కన్నేసిన కెసిఆర్ మజ్లిసే పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. అయినా పైకి మాత్రం అలాంటిది ఏమి లేదని కెసిఆర్ ఎన్నిసార్లు చెప్పారు. కానీ కార్యాచరణలో మాత్రం అవన్నీ అబద్దాలని ఎప్పటికప్పుడు తేలిపోతోంది. ఇప్పుడు కూడా అదే జరికింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకు ఇచ్చి దేశవ్యాప్తంగా మజ్లిసి మద్దత్తు కూడబెట్టుకోవాలనే ఒప్పందం ఇద్దరి మధ్య దాదాపు ఫలించింది. ఎంఐఎం తరుపున మీర్జా రెహమత్ బేగ్ నామినేషన్ వేశారు. డమ్మీ అభ్యర్థిగా మహ్మద్ రహీంఖాన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. వీళ్ళకు పోటిగా బిఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్తితో నామినేషన్ వేయించలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇంకా ఉలుకు-పలుకు లేదు. దీనికితోడు ఎంఐఎం తరుపున మీర్జా రెహమత్ బేగ్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్ తదితరులు వచ్చారు. కానీ తమ పార్టీ నామినేషన్ ఊసే ఎత్తలేదు. దీంతో బీఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటేనని తేలిపోయింది. మర్చి 13న ఎన్నికల పోలింగ్ 16న కౌంటింగ్ ఉండే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఈనెల 27న నామినేషన్ ఉప సంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవ ప్రకటన చేయనున్నారు.
ఈ స్థానానికి చివరి రోజు వరకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఈ స్థానం ఎంఐఎం దక్కనుంది అని దాదాపు తేలిపోయింది. గతంలో ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య విభేదాలు వచ్చాయని ఈ స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ తరుపున ఇంకా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎంఐఎంకే ఈ స్థానం దక్కే అవకాశాలున్నాయి. వీళ్ళు పైకి చెప్పేది ఒకటి – లోలోపల చేసేది ఒకటి – అదే రాజకీయం.