హిందూ సంప్రదాయం ప్రకారం రెండు పెళ్ళిళ్ళు చెల్లవు. రెండో పెళ్లి చేసుకోవాలంటే మొదటి భార్యతో విడాకులైనా తీసుకోవాలి, లేదా మొదటి భార్య చనిపోయి అయిన ఉండాలి. కాని మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం చట్టప్రకారం శిక్ష విధిస్తారు. కానీ ఓ ఫ్యామిలీ కోర్టు మాత్రం రెండు పెళ్ళిళ్ళను అంగీకరించడమే కాకుండా అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
హరియానాకు చెందిన ఓ వ్యక్తి మల్టినేషనల్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం అయింది. రెండేళ్లపాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ లాక్ డౌన్ విధించడంతో భార్యను 2020లో పుట్టింటికి పంపించాడు. ఆ తరువాత లాక్ డౌన్ ఎత్తివేసినా భార్యను తీసుకెళ్ళకుండా హరియానా వెళ్ళాడు. ఈ క్రమంలోనే అదే కంపెనీలో పని చేస్తోన్న మరో మహిళాను రెండో వివాహం చేసుకున్నాడు.
లాక్ డౌన్ ముగిసినా భర్త తనను తీసుకెళ్లకపోవడంతో మొదటి భార్యకు అనుమానం వచ్చింది. తన భర్త ఉద్యోగం చేసే చోటుకు వెళ్లి ఆరా తీస్తే రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.దీంతో తనకు న్యాయం చేయాలనీ మొదటి భార్య గ్వాలియర్ లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఆరు నెలలపాటు వారికీ కోర్టు కౌన్సిలింగ్ ఇచ్చింది. చివరకు ముగ్గురితో కౌన్సిలింగ్ ఇచ్చిన వ్యక్తి వారి మధ్య రాజీ కుదిర్చారు. భర్త వారంలో మూడు రోజులు మొదటి భార్యతో, మరో మూడు రోజులు రెండో భార్యతో ఉండాలని, ఆదివారం భర్త ఇష్టమని ముగ్గురి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కోర్టుకు నివేదించారు. ఈ నిర్ణయాన్ని అతడి ఇద్దరు భార్యలు అంగీకరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి కూడా దీనికి ఓకే చెప్పారు.
అయితే… ముగ్గురు ఒకే చోట కలిసి ఉండకుండా తన భార్యలకు వేర్వేరు చోట్ల ఫ్లాట్ లను కొనిచ్చాడు భర్త.దాంతో వారంలో మూడు రొజులు ఓ భార్యతో , మరో మూడు రొజులు అతను కలిసి ఉండనున్నాడు.
Also Read : వీకెండ్ మ్యారేజ్ ల వైపు యువత ఆసక్తి – ఇదే ఇప్పుడు నయా ట్రెండ్