”ఈడి కవితను ముద్దు పెట్టుకుంటుందా?” అని డబుల్ మీనింగ్ ధ్వనించేలా బండి సంజయ్ లోగడ ఎంఎల్సి కవితను కించపరిచిన విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్య లను సొంత బిజెపి నాయకులే తప్పుపట్టారు.
దీనిని తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని అతని మీద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి జరిపే విచారణకు ఈ నెల 15 తేదినా హాజరు కావాలని నోటీసులు పంపింది.
దీనిని బండి సంజయ్ ఏ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందువల్ల తాను ఈ నెల 15 న హాజరు కలేనని, ఈ నెల 18 న హాజరు అవుతానని లేఖ రాశారు. అయితే దీనికి ముందు తాను హాజరు కావలసి అవసరం ఎందుకు వచ్చిందో వివరణ కావాలని అతను రాసిన లేఖలో అడిగారు. దీనికి మహిళా కమిషన్ జవాబు ఇస్తేనే తాను హాజరవుతాను అనే కండీషన్ పరోక్షంగా ధ్వనించింది.
మరీ మహిళా కమిషన్ అతనికి జవాబు ఇచ్చి పిలిపించు కుంటుందా? లేక జవాబు ఇవ్వకుండా, వాళ్ళకు ఉండే కొన్ని ప్రతేక్య అధికారాలతో అరెస్ట్ చేయించి పిలిపించుకుంటుందో చూడాలి.