బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం ఇంకా ఏమాత్రం కుదుటపడలేదు. మెదడు పైభాగం దెబ్బతినడంతో రక్తప్రసరణ లేక వాపు ఏర్పడింది. అలాగే నీరు చేరిందని వైద్యులు గుర్తించారు. విదేశాలకు తీసుకెళ్లాలని భావించిన…అలా చేస్తే ఇబ్బంది అవుతుందని ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. విదేశాలకు చెందిన పేరుమోసిన న్యూరో వైద్య నిపుణులను ఇండియాకు రప్పిస్తున్నారు.
ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బట్టి చూస్తే ఆయన కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. వైద్యులు తారకరత్న బ్రెయిన్ ను స్కాన్ చేయగా.. ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని రికవరీ కావడానికి సమయం పడుతుందని తెలిపారు. కాస్త… ఊరట కల్గించే అంశం ఏంటంటే.. ఇంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతం వైద్యానికి తారకరత్న వేగంగా స్పందిస్తున్నారని అంటున్నారు. అతనిని తొందరగా స్పృహలోకి తీసుకొచ్చేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరో విభాగానికి చెందిన ఫేమస్ వైద్యులను ఇండియాకు రప్పించి.. తారకరత్నకు ట్రీట్మెంట్ ఇప్పించాలని భావిస్తున్నారు.
మరోవైపు నందమూరి ఫ్యామిలీ తారకరత్న ఎప్పుడు కోలుకుంటాడా..? మామూలుగా మనిషి ఎప్పుడు అవుతాడా..? అని రోజుల తరబడి వెయిట్ చేస్తోంది. అటు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ , తారకరత్న ఫ్యాన్స్ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అలాగే.. పాలిట్రిక్స్ కూడా తారకరత్న తొందరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది.
Also Read : సినీ ఇండస్ట్రీలో కలవరం – అనుష్క, రేణు దేశాయ్ లకు ఏమైంది…?