బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవాలని చాలామంది ఆరాట పడుతున్నారు. అటు నందమూరి ఫ్యామిలీ కాని, ఇటు వైద్య వర్గాల నుంచి ఎలాంటి హెల్త్ అప్డేట్ లేదు.
తారకరత్న అవుటాఫ్ డేంజర్ అని పైకి చెబుతున్నా.. లోలోపల ఏదో జరుగుతుందన్న అనుమానం నందమూరి అభిమానుల్లో ఉంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మాటలు ఈ అనుమానాలను మరింత పెంచేశాయి. తాజాగా ‘అమిగోస్’ సంబంధించి కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్యం గురించి విలేకరులు కళ్యాణ్ రామ్ ను ప్రశ్నించగా నేరుగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు చెబుతారు. మనం చెప్పకూడదని సమాధానం దాటేశారు. నిజంగా.. తారకరత్న హెల్త్ గురించి కళ్యాణ్ రామ్ కు అప్డేట్ లేకుండా ఉంటుందా..? లేకపోయినా తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపకుండా ఉంటారా..? అన్నది అందరి ప్రశ్న.
నోరు తెరిచి కళ్యాణ్ రామ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పిన అది సున్నితమైన విషయం. అందుకే ఆయన నోరు విప్పలేదని అనుకోవచ్చు. తారకరత్న పూర్తిగా అవుటాఫ్ డేంజర్ అనుకుంటే.. కళ్యాణ్ రామ్ కి ఈ విషయం చెప్పడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఆ స్థితి నుంచి తారకరత్న ఇంకా బయటపడి ఉండకపోవచ్చు. అందుకే తారకరత్న ఆరోగ్యం గురించి కళ్యాణ్ రామ్ నోరు విప్పలేదని తెలుస్తోంది.
మొత్తానికి కల్యాణ్ రామ్ కామెంట్లు…తారకరత్న ఆరోగ్య స్థితి గురించి కొత్త అనుమానాలూ, ప్రశ్నలూ రేకెత్తించే విధంగానే ఉంది.
Also Read : తారకరత్నకు అరుదైన వ్యాధి – పరిస్థితి విషమం..!