సినిమాలకు ఎప్పుడో దూరమైనా నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్నారు.ఆయన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో యాక్టివ్ కావాలనుకుంటున్నారు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఇటీవల గుంటూర్ జిల్లాలో టీడీపీ నేతలు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన తారకరత్న తాను ఎన్నికల్లో పోటీకి సిద్దమని ప్రకటించేశారు. కాని ఆయన పోటీ ప్రకటనను టీడీపీ సీరియస్ గా తీసుకోలేదు. ఆయన మాత్రం టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించాలని తాజాగా లోకేష్ ను కలవడంతో స్పష్టమైంది.
ఏపీలో ఎదో ఓ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున తారకరత్నకు టికెట్ ఇవ్వడం కష్టమే. ఎందుకంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలే ఉన్నారు. ఎదో సర్దుబాటు చేసి తారకరత్నకు టికెట్ ఇచ్చినా ఆ నియోజకవర్గానికి ఆయన కొత్త అవుతారు. దీంతో ఆయనను వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంపై టీడీపీ సీరియస్ గా దృష్టి పెట్టలేదు.
కాకపోతే, టీడీపీకి నందమూరి కుటుంబం మద్దతు కావాలని కోరుకుంటే తారకరత్నకు ఎదో ఒక నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే అది ఏపీ నుంచా..? తెలంగాణ నుంచా అన్నది తేలాల్సి ఉంది.
తారకరత్నను నందమూరి ఫ్యామిలీ దూరంగా పెట్టింది. ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన నిర్ణయాల వలన కుటుంబం ఆయన్ను దూరం పెట్టింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మేనకోడల్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయినా అయన మాత్రం అప్పుడు, ఇప్పుడూ టీడీపీతోనే ఉన్నారు.
రాజకీయ అరంగేట్రంపై ఇప్పటివరకు తారకరత్న ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేదు. ఇటీవల మాత్రం ఆయన పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ ఆయన్ను ఎక్కడి నుంచి బరిలో నిలుపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : చంద్రబాబుతో రజినీకాంత్ భేటీ- ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?