ప్రేమికుడితో కలిసి సరదాగా బయటకు వెళ్ళిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. సాయంత్రం సమయాలను అలా వీక్షిద్దామని బయటకు వెళ్ళిన ఆ ప్రేమ జంటపై అక్కడే మద్యం సేవిస్తోన్న దుండగులు దాడి చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కాంచిపురంలో 19ఏళ్ల యువతి తన కాలేజ్ లో చదివే అబ్బాయితో కలిసి బెంగళూర్ , పుదుచ్చేరి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మూడు కి. మీ దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ వద్దకు వెళ్ళింది. అక్కడ కలిసి మాట్లాడుకున్నారు. గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో వీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు. అదే సమయంలో అక్కడ ఇద్దరు మద్యం సేవిస్తున్నారు.
వీరూ మరో ముగ్గురికి కాల్ చేసి రమ్మని చెప్పారు. దాంతో ఆ ఐదుగురు కలిసి ఆ ప్రేమ జంటను బెదిరించారు. ఆమె బాయ్ ఫ్రెండ్ ను గట్టిగా పట్టుకొని అతని ముందే యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.
Also Read : ప్రియుడి మోజులో పడి భర్తను భార్య ఏం చేసిందంటే..?
Also Read : పదమూడేళ్ళ విద్యార్ధినికి ఉపాధ్యాయుడు లవ్ లెటర్..!
Also Read : ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకున్నాడు – రెండు రోజులకే ఝలక్ ఇచ్చాడు..!