టెన్త్ పేపర్ లీక్ కుట్రదారుడు బండి సంజయ్ , ప్రశాంత్ అని వరంగల్ సీపీ రంగనాథ్ తేల్చి చెప్పారు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం నుంచే వాట్సప్ చాటింగ్ చేసుకొని పథకంలో భాగంగానే పేపర్ ను లీక్ చేశారని సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో ఏ-1 బండి సంజయ్ , ఏ-2గా ప్రశాంత్ ను చేర్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు నలుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
హిందీ క్వశ్చన్ పేపర్ కమలాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి బయటకోచ్చిందని వరంగల్ సీపీ తెలిపారు. ఉదయం 11:18గంటలకు ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ ఫోటో తీసి వాట్సప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే 11 :24గంటలకు బండి సంజయ్ కి ఫార్వార్డ్ చేశారు. ఆ తరువాత మీడియా గ్రూప్ లో షేర్ చేశాడు. ఈటల రాజేందర్ తోపాటు ఆయన పీఏకు కూడా ప్రశ్నా పత్రాన్ని పంపించారని సీపీ తెలిపారు. క్వశ్చన్ పేపర్ ను షేర్ చేసిన తరువాత 149మందితో ప్రశాంత్ ఫోన్ కాల్ మాట్లాడినట్లు చెప్పారు.
తెలుగు పేపర్ బయటకొచ్చాక మరో పేపర్ ను లీక్ చేస్తే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయవచ్చుననే ఉద్దేశ్యంతో బండి సంజయ్ , ప్రశాంత్ లు కుట్రకు పాల్పడ్డారని సీపీ వెల్లడించారు. కార్పోరేట్ స్కూళ్ళతో సర్కార్ ఒప్పందం చేసుకొని పేపర్లను లీక్ చేస్తోందని బండి , ప్రశాంత్ ల మధ్య వాట్సప్ చాటింగ్ నడిచింది. ఇదంతా కేటీఆర్ కనుసన్నలోనే నడుస్తోందని ఇద్దరి మధ్య సంబాషణ నడిచింది.హిందీ ప్రశ్నపత్రం లీకైన తర్వాత ప్రశాంత్ పంపించిన సందేశాన్నే బండి సంజయ్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. అవన్నీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు సీపీ.
Also Read : బండి సంజయ్ లోక్ సభ సభ్యత్వం రద్దు..?