తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పతనం అవుతోంది. వారం , వారం తెలంగాణ పొలిటికల్ పల్స్ పై తెలంగాణ ఇంటెన్షన్ సర్వే చేపడుతోన్న ఫలితాలు వీటిని రుజువు చేస్తున్నాయి. గత వారం నుంచి బీఆర్ఎస్ అదే గ్రాఫ్ ను మెయింటేన్ చేస్తున్నా కాంగ్రెస్ పుంజుకోవడం అధికార పార్టీని ఆందోళనకు గురి చేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 38శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉండగా తరువాత 29శాతం ఓటింగ్ తో సెకండ్ ప్లేసులో కాంగ్రెస్ కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య ఏమంత పెద్దగా ఓటింగ్ శాతం గ్యాప్ లేకపోవడం.. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకుంటుందని నివేదికల నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఎదురుదాడిని పీక్స్ కు తీసుకెళ్లాలని చూస్తోంది. ఈ నెల 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ఇవ్వనుంది. రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లతోపాటు ఈ ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ ఎన్నికల హమీలుగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. వీటితో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.
ఇక జమిలి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు దేబ్బెనని సర్వేలో తేలింది. ప్రస్తుతం 38శాతం ఓటింగ్ 35కు పడిపోతుందని.. అదే సమయంలో కాంగ్రెస్ 30శాతంతో టఫ్ ఫైట్ ను ఇస్తోందని తేలింది. వీటన్నింటిని పరిశీలిస్తే బీఆర్ఎస్ లో కొంత ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో కనిపించిన భరోసా ప్రస్తుతం ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదు.
Also Read : డేంజర్ జోన్ లో పది మంత్రులు – క్లాస్ పీకిన కేసీఆర్..!