ప్రముఖ యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా సంస్థలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంతో ఉందా..? నిత్యం మార్నింగ్ న్యూస్ లతో ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు ప్రసారం చేయడంపై సర్కార్ కన్నెర్ర జేసిందా..? ఎన్నికల ముంగిట ఈ ఛానెల్స్ ను లైట్ తీసుకుంటే ఇబ్బందులు తప్పవని కేసీఆర్ అండ్ కో ఓ అంచనాకు వచ్చేసిందా..? అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్.
మెయిన్ స్ట్రీం మీడియా ఆంధ్రజ్యోతితోపాటు ప్రముఖ యూట్యూబ్ ఛానెల్స్ తీన్మార్ మల్లన్న నేతృత్వంలో కొనసాగుతున్న క్యూ న్యూస్ , రఘు అధ్వర్యంలో కొనసాగుతున్న మన తొలివెలుగు, దాసరి శ్రీనివాస్ అధ్వర్యంలో నడుస్తోన్న కాళోజీ టీవీపై సర్కార్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పోస్టింగ్ లపై ప్రగతి భవన్ కోపంతో కుతకుతలాడుతున్నట్లు సమాచారం. మార్నింగ్ న్యూస్ లతో నిత్యం సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రత్యామ్నాయ ఆలోచన మొదలైంది. ఎక్కడ చూసినా మార్నింగ్ న్యూస్ ల కబుర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి బాగోతం, సర్కార్ పెద్దల అసమర్ధతను నిర్దిష్టంగా మార్నింగ్ న్యూస్ లో గణాంకాలతో సహా ప్రదర్శిస్తున్నారు. సర్కార్ అనుకూల వార్తలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళడం లేదని బీఆర్ఎస్ టెక్నికల్ టీమ్ సర్కార్ పెద్దలకు వివరించింది. దీంతో సర్కార్ వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోన్న ఛానెల్స్ పై సర్కార్ ఆగ్రహంగా ఉందని..మరికొద్ది రోజుల్లో ఈ ఛానెల్స్ ప్రసారాలకు ఆటంకాలు కల్గేలా ప్రయత్నాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఎన్నికల ముంగిట ఈ ఛానెల్స్ ను చూసి చూడనట్టు వదిలేస్తే ఓటు బ్యాంక్ చేజారిపోయే అవకాశం ఉందన్న సూచనలతో ప్రగతి భవన్ అలర్ట్ అయినట్లు సమాచారం.
Also Read : బీసీల ఆత్మీయ సమ్మేళనం ఎఫెక్ట్ – ఇంటలిజెన్స్ రిపోర్ట్ కోరిన కేసీఆర్..!?