డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఈమేరకు ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ నేతలను కేసీఆర్ సమాయత్తం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ మాత్రం ఎన్నికలను వాయిదా వేసే ప్లాన్ లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు ముగియగానే మే లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఈసారి చావుదెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయాలను పసిగట్టిన కేంద్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతోపాటు జరపాలనుకుంటున్నట్లు సమాచారం.
కేసీఆర్ ను రాష్ట్రం దాటకుండా జాతీయ రాజకీయాల్లోకి రానీయకూడదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకూడదంటూ బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదెలా అంటే.. 2024 మే లో సార్వత్రిక ఎన్నికలతోపాటు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను జరపాలని కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే నెలలో ఎన్నికలు నిర్వహించే యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్ తెలంగాణ గడప దాటలేడని అందుకే పార్లమెంట్ ఎన్నికలతోపాటు తెలంగాణ ఎన్నికలను నిర్వహించే ప్లాన్ ను బీజేపీ చేస్తున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ కు , అసెంబ్లీకి ఒకేసారి ఒకేసారి ఎన్నికలు జరిగితే అది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఈ ఆలోచనతోనే పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాయి.
తెలంగాణపై గురి పెట్టిన బీజేపీ ఈసారి డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికల కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కదిద్దాక మేలో సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
Also Read : కేసీఆర్ అస్త్రం తెలంగాణ కాదిప్పుడు – కొత్త సెంటిమెంట్ తో..!