తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసింది ఉన్నత విద్యామండలి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
మే 12, 13, 14 తేదీలలో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీలలో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు మాత్రం యధాతధంగా జరుగుతాయని తెలిపారు. నీట్, టీఎస్ పీస్సీ పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షా షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు దరఖాస్తులు భారీగా వస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం వరకు మొత్తం 1.80 లక్షలకు పైగా విద్యార్థులు దరాఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తుకు మరో పదిరోజుల గడువు ఉండటంతో ఇంకా దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 1.80 లక్షల దరఖాస్తుల్లో ఇంజనీరింగ్ విభాగంలో 1,14,989, అగ్రికల్చర్ విభాగంలో 65,033 అప్లికేషన్లు వచ్చినట్లు విద్యామండలి అధికారులు వెల్లడించారు.
Also Read : సమ్మర్ హాలీడేస్ ఎప్పటి నుంచో తెలుసా..?