తెలంగాణ కాంగ్రెస్ నేతలు మారేలా లేరు. ప్రభుత్వ వైఫల్యాలను సమిష్టిగా ఎండగట్టాల్సింది పోయి, తమలో తాము పోరాడటానికి కత్తులు దూసుకుంటున్నారు. అధిష్టానం ప్రకటించిన టీ పీసీసీ కమిటీల విషయంలో పార్టీ నేతలు కొందరు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తమకన్నా జూనియర్లకు పైకమిటీలో చోటిచ్చి , మాకు మాత్రం అన్యాయం చేశారని అసంతృప్తి రాగం అందుకున్నారు. తమకు పలానా కమిటీలో చోటు కల్పించలేదని మరీ, సెకండ్ గ్రేడ్ లీడర్ తరహా కమిటీలో చోటు కల్పిస్తారా అంటూ రాజీనామా అస్త్రాలను స్టార్ట్ చేసేశారు.
మొదట కొండా సురేఖ రాజీనామా చేయగా ఆ తరువాత బెల్లయ్య నాయక్ నాకు ఈ పదవి వద్దంటూ రిజైన్ చేశారు.అయితే, టి.కాంగ్రెస్ అసంతృప్తులతో వరుసగా భట్టి విక్రమార్క భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ఈ అసంతృప్తులు వెనక భట్టి విక్రమార్క ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఎందుకంటే, గతంలో రేవంత్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఆయన పాదయాత్రకు పర్మిషన్ ఇస్తే నేను పాదయాత్ర చేస్తా. నాకు అనుమతి ఇవ్వాలంటూ అడ్డం పడ్డారు. భట్టి వలన ప్రస్తుతం ఆ పాదయాత్ర ఊసే లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా…ఇటీవల ప్రకటించిన టీపీసీసీ నూతన కమిటీలో రేవంత్ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెరవెనక రేవంత్ ను వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. రేవంత్ ను పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏవేవో ప్రయత్నాలు చేసి తన రాజకీయ భవిష్యత్ ను డేంజర్ జోన్ లో వేసుకున్నారు. ఇప్పుడు, మరికొంతమంది అదే ప్రయత్నం చేసి పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసుకునే అవకాశం ఉంది