గతానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ లో టికెట్ల కోసం ఎక్కువమంది పోటీపడుతున్నారు. దరఖాస్తులు చేసుకోవాలని టీపీసీసీ నాయకత్వం ఆదేశించడంతో 119నియోజకవర్గాల కోసం 1000మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో అశావాహులు పోటీ పడుతున్నారు. ఆయా సెగ్మెంట్లలో ఎక్కువ పోటీ ఉంటే ఇద్దరు, ముగ్గురేసి బలమైన లీడర్లతో షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. ఈ పేర్లనే ఏఐసీసీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది.
కొల్లాపూర్ కోసం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేతూరి వెంకటేష్ తోపాటు జగదీశ్వర్ రావులు పోటీ పడుతున్నారు. వనపర్తి టికెట్ కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డితో పాటు మేఘా రెడ్డి పోటీ పడుతున్నారు. షాద్ నగర్ టికెట్ కోసం వీర్లపల్లి శంకర్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ లు పోటీ పడుతున్నారు. కల్వకుర్తి నుంచి వంశీచంద్ రెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిలు ఆశిస్తున్నారు. మక్తల్ నుంచి శ్రీహరి, నాగరాజు గౌడ్, గద్వాల నుంచి సరితా తిరుపతయ్య, రాజీవ్ రెడ్డిలు పోటీ పడుతుండగా… నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి , కూచుకుళ్ల రాజేశ్ రెడ్డిలు పోటీ పడుతున్నారు.
మహబూబాబాద్ కోసం మాజీ మంత్రి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మురళీ నాయక్ పోటీ పడుతున్నారు. జనగామ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డితోపాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కోరుతున్నారు. వరంగల్ పశ్చిమ సీటును నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవ రెడ్డిలు కోరుతున్నారు. స్టేషన్ ఘన్పూర్ టికెట్ ను ఇందిర, దొమ్మాటి సాంబయ్యలు ఆశిస్తున్నారు. డోర్నకల్ సీటు రామచంద్రు నాయక్, నెహ్రూ నాయక్ ల మధ్య ఎవరికీ ఇవ్వాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.
ఇల్లందు స్థానాన్ని భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు చీమల వెంకటేశ్వర్లు ఆశిస్తున్నారు. కొత్తగూడెం సీటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోట్ల నాగేశ్వర్రావు, ఎడవెల్లి కృష్ణ, సత్తుపల్లి టికెట్ కోసం సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాతలు కోరుతున్నారు.
సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, పటేల్ మేశ్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డి, బి. లక్ష్మారెడ్డి, దేవరకొండ నుంచి బాలూ నాయక్, వడ్త్యా రమేశ్‌నాయక్, కిషన్ నాయక్, మునుగోడు స్థానాన్ని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి, పున్న కైలాశ్ నేత ఆశిస్తున్నారు. తుంగతుర్తి స్థానం అద్దంకి దయాకర్, జ్ఞానసందర్, ప్రీతమ్ లు ఆశిస్తున్నారు.
హుస్నాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ గౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్, ఖైరతాబాద్ నుంచి రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి, ఉప్పల్ టికెట్ రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు పోటీ పడుతున్నారు.
ముషీరాబాద్ సీటు అంజన్ కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, మేడ్చల్ టికెట్ తోటకూర జంగయ్య యాదవ్, హరివర్ధన్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ టికెట్ భూపతిరెడ్డి నర్సారెడ్డి, కొలను హన్మంత్‌రెడ్డి, మలక్ పేట సీటు చెక్లోకర్ శ్రీనివాస్, అశ్వక్, గోషామహల్ స్థానం మెట్టు సాయికుమార్, ప్రేమ్ లాల్, సనత్ నగర్ సీటు కోట నీలమ, మర్రి ఆదిత్య రెడ్డి, శేరిలింగంపల్లి స్థానం జర్పెటీ జైపాల్, సత్యనారాయణరావు, నారాయణ ఖేడ్ సీటు సురేశ్ షెట్కర్, సంజీవ రెడ్డి, కూకట్పల్లి స్థానం శ్రీరంగం సత్యం, వెంగల్రావులు.. ఇలా ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
ఖరారైన అభ్యర్థులు వీరే..
కొడంగల్ అసెంబ్లీ సీటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కరే అప్లికేషన్ పెట్టుకోవడంతో ఆయన అభ్యర్థిత్వం ఫిక్స్ అయింది. వీరితోపాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికీ టికెట్లు ఖరారు చేశారు. మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పోదెం వీరయ్య, సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంథని నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ బాబులకు టికెట్ కన్ఫాం అయింది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ, మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ , ఉత్తమ్ భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీలో ఉండటం లాంచానమే. జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఆలంపూర్ నుంచి సంపత్ కుమార్, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్, పరిగి నుంచి రామ్మోహన్‌రెడ్డి, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, ఆంథోల్ నుంచి దామోదర రాజనర్సింహా పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి.