బడ్జెట్ సమావేశాలు నెల రోజుల ముందుగానే నిర్వహించడంతో అసెంబ్లీని రద్దు చేయబోతున్నట్లు తెలంగాణ సర్కార్ సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనేఇటీవల ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావులతో మాత్రమే కేసీఆర్ హడావిడిగా మీటింగ్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసమే ఈ సమావేశం నిర్వహించారని ప్రచారం జరుగుతుండగా..అనూహ్యంగా ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు క్యాబినెట్ భేటీని నిర్వహించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొన్నాళ్ళుగా ముందస్తు ముచ్చట జోరుగా జరుగుతోంది. ఆ మధ్య ఈ ప్రచారాన్ని స్వయంగా తోసిపుచ్చిన కేసీఆర్.. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మనస్సు మార్చుకొని ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీకి అభ్యర్థుల కొరత వేధిస్తుండగా…కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే రేసులోకి దూసుకోస్తోంది. ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇంకా సిద్దం కాకముందే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే కర్ణాటకతో పాటే ఎన్నికలు జరిగితే కేసీఆర్, బీఆర్ఎస్‌కు తిరుగు ఉండదన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.
యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పాదయాత్ర చేస్తోన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్తూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రధానంగా రేవంత్ ఎత్తిచూపుతున్నారు. ఆయన బీఆర్ఎస్ కు విసురుతున్న సవాళ్ళపై ఆ పార్టీ నుంచి కౌంటర్లు కూడా రావడం లేదు. దీంతో జనాలు కాంగ్రెస్ వైపు టర్న్ అవుతున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అందుకే కేసీఆర్ ముందస్తు వైపు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
కేసీఆర్ లెక్క ప్రకారం ఆరు నెలలు ముందుగా ఎన్నికలు జరిగితే ముందస్తేం కాదు.. అందుకే ఈ ఫార్ములా ప్రకారం ఆయన వెళ్లొచ్చని చెబుతున్నారు. ఒక వేళ ఈ మంత్రివర్గ సమవేశంలో ముందస్తుపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయాలెం. ఇకపోతే.. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా సొంత జాగా ఉన్న వారికీ ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల సాయం, ఉద్యోగాల భర్తీ , దళిత బంధు అమలు, కొత్త క్రీడా పాలసీపై మంత్రులతో చర్చించనున్నారు కేసీఆర్. మూడు లక్షల సాయానికి సంబంధించి గైడ్ లైన్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read : కేసీఆర్ కు బిగ్ షాక్ – టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ