తెలంగాణ బిజెపి రెండుగా చీలింది. ఒక గ్రూప్ కి బండి సంజయ్ నాయకుడు. వీళ్ళు బిజెపి గూటి పక్షులు. మరో గ్రూప్ కి ఈటల రాజేందర్ నాయకుడు. ఈయన గ్రూప్ లో వలస పక్షులు ఉన్నాయి. బండి సంజయ్ కి డైపర్ బలుపు ఎక్కువుంటే ఈటల కాస్త టంగ్ పవర్ ఎక్కువ. బండి సంజయ్ కి బిపి ఎక్కువుంటే ఈటలకి షుగర్ లెవల్ ఎక్కువ. బండి సంజయ్ కి కొలస్ట్రాల్ ఎక్కువుంటే ఈటలకి హిమోగ్లోబిన్ ఎక్కువ. దొందు దొందే.
ఒకరి మీద మరొకరు సిగపట్లు పట్టుకుంటున్నారు. చీలిన ఈ పార్టీని ఫెవికాల్ పెట్టి అతికించాలని నడ్డా చేసిన ప్రయత్నాలు ఈ గద్ద మీద పలించలేదు. ఇద్దరినీ కలపాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బెడిసి కొడుతున్నాయి. ఇటీవలి సమావేశంలో పార్టీలో కోవర్టులు ఉన్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా కు నడ్డా మోశాడు. ఈటలను పికేయడం కంటే, ఆయన మద్దతుదారులను తీసివేయాలని ఆదేశాలు వచ్చాయి. బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తిగానున్న బాబు మోహన్ ఎలాగూ ఈటలకు మద్దతుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కమలం కాంపౌండ్ లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఎలాగో సస్పెండ్ చేస్తున్నారు, తెగించినవాడికి తెడ్డే లింగం. కాబట్టి బిజెపి అసలు లుకలుకలు బయట పెట్టాలని బాబు మోహన్ బండి నీ అమ్మనా బూతులు, అక్కనా బూతులు, చెల్లినా బూతులు తిట్టి కావాలనే మీడియాలో వచ్చేలా చేశాడు. బిజెపి కమలం పువ్వు పగల గొట్టారు. పరిస్టితిని నివురు కప్పిన నిప్పులా మార్చాలని కమలం మీద సెంట్ చల్లుతోంది బిజెపి. కానీ కమలాన్ని మురికిలోంచి ఎలా బయటికి తీయ గలరు? మురికి లేకుండా కమలం బతకదు. అందుకే కమలాని పూజకు వాడరు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. తనను ఎవ్వరు చూడడం లేదనుకుంటుంది. బిజెపి చీలిందని అధికారికంగా ప్రకటించకపోయినా అనదికారికంగా అందరికి తెలిసిందే.