కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని మెజార్టీ జనాలు విశ్వసిస్తున్నారు. బీజేపీ – బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేస్తోన్న ప్రచారం నమ్మశక్యంగా ఉందని జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న అందరిని విచారించి అరెస్ట్ చేసిన ఈడీ, సీబీఐ ఒక్క కవితను మాత్రం విచారించి అరెస్ట్ చేయలేదు. దీంతో బీఆర్ఎస్ – బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఉందన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్లు అయింది.
ఇదే బీజేపీ , బీఆర్ఎస్ గ్రాఫ్ ను తగ్గిస్తున్నాయి. కాంగ్రెస్ రేంజ్ ను పెంచుతున్నాయి. దాంతో చాలామంది నేతలు కవితను అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో బీజేపీని విశ్వసించే పరిస్థితులు లేవని హైకమాండ్ కు తేల్చి చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఎంత పోరాడినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప జనాల అటెన్షన్ దక్కించుకోలేమని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ గ్రాఫ్ పెరగాలంటే కవిత అరెస్ట్ తప్ప మరో మార్గం లేదని చెప్తున్నారు. ఇదే అంశాన్ని ఢిల్లీ పర్యటనలోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రనేతలకు వివరించినట్లు సమాచారం.
కవిత అరెస్ట్ కోసం బీజేపీ హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ నేతల సూచనను కాదంటే పార్టీ వీడే అవకాశం ఉందని కూడా ఓపెన్ గానే చెప్తున్నారు. ఎన్నికల వేళ ఇది పార్టీకి ఎదురు దెబ్బ లాంటిదే. పైగా కాంగ్రెస్ పుంజుకుంటే అది బీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ నష్టాన్ని చేస్తుంది. అందుకే కవిత విషయంలో ఏం చేయాలన్న దానిపై అగ్రనేతలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది.
Also Read : అమిత్ షా తో సమావేశం కానున్న కేటీఆర్ – కవిత కోసమేనా..?