యువగళం పాదయాత్రలో మొదటి రోజు నారా లోకేష్ తో కలిసి పాల్గొన్న నందమూరి తారకరత్న అకస్మాత్తుగా సొమ్మసిల్లిపడిపోయారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స చేయించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని వైద్యులు తేల్చారు. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శనివారం బెంగళూర్ వెళ్లి తారకరత్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో చంద్రబాబు మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కూడా ఆసుపత్రికి వెళ్ళారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఆయన కోలుకునేందుకు బాగా సమయం పడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా తారకరత్నకి అరుదైన వ్యాధి సోకిందట.ఆ వ్యాధి పేరు మెలెనా.
ఇది అరుదైన వ్యాధిగా డాక్టర్లు చెప్తున్నారు. ఈ వ్యాధి జీర్ణాశయంలో రక్త ప్రవాహంకి సంబంధించినది. దీనివల్ల నోరు ,అన్నవాహిక మరియు పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంలో రక్త కణాలు గణనీయంగా తగ్గిపోయి అనీమియా కి దారి తీస్తుంది. అంతే కాదు శరీరం రంగు మారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయని డాక్టర్లు వెల్లడించారు.’
తారకరత్నకు మొదట చికిత్స అందించిన వైద్యులు కూడా ఇదే చెప్పారు. ఆయన శరీరం నీలం రంగు లోకి మారిపోయిందని చెప్పారు..శరీరం నీలంగా మారడం ఏంటి..అంటే తారకరత్నపై విష ప్రయోగం లాంటివి ఏమైనా జరిగాయా అభిమానులు సందేహ పడ్డారు.కానీ అసలు కారణం ఇది అని ఇప్పుడు అందరికీ అర్థం అయ్యింది.