గవర్నర్ తో పంచాయితీ పెట్టుకోవద్దని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. గవర్నర్ తో పోరు ఎటొచ్చి తమకే ఇబ్బందికరంగా మారుతుందని ఇక కాస్త ఆచితూచి వ్యవహరించాలని ఫిక్స్ అయింది. గవర్నర్ చెప్పినట్టు నడుచుకోవాలని..లేదంటే ప్రజల ముందు పరువు పోయేలా ఉందని ఓ అంచనాకు వచ్చినట్టుంది ప్రభుత్వం. అందుకే గవర్నర్ చెప్పినదానికల్లా ఒకే చెప్తుంది. చివరికి ప్రభుత్వం తరుఫున గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన స్పీచ్ ను మార్చమంటే మార్చేస్తాం మేడం అంటూ హామీ ఇస్తున్నారు. ఆమె చెప్పినట్టుగా తలాడిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెట్టకూడదని భావించి.. గత సమావేశాలకు కొనసాగింపుగానే సభ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది ప్రభుత్వం. తరువాత మారిన పరిణామాలతో గవర్నర్ తో నోటిఫికేషన్ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి… గవర్నర్ స్పీచ్ ను ఆమెకు ముందుగానే పంపారు. ఆ ప్రసంగంలో గవర్నర్ పలు మార్పులు సూచించారు. వాస్తవాలను ప్రతిబింబించేలా స్పీచ్ ఉండాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచించారు. గవర్నర్ ఆదేశాలతో స్పీచ్ లో మార్పులు చేసేందుకు ప్రశాంత్ రెడ్డి అంగీకరించారు.
శుక్రవారం ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ స్పీచ్ కేబినేట్ ఆమోదించినదే ఉంటుంది. కాని ఆమె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విమర్శలు చేస్తారేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇటీవల ఏమాత్రం తగ్గకుండా రాజకీయ విమర్శలు చేస్తోన్న గవర్నర్ ఇప్పుడు మరోసారి సభ సమావేశాల్లోనే అలాంటి విమర్శలు చేస్తే ఎలా అని కంగారు పడుతోంది. అందుకే.. ఆమె సూచన మేరకు మార్పులు చేస్తున్నారు.
Also Read : కేసీఆర్ పై గవర్నర్ దే అప్పర్ హ్యాండ్