రాజకీయాల్లో తలపండిన సొంత పార్టీ నేతలు తనకు ప్రత్యామ్నాయంగా మారితే ఎప్పుడు ఎవరిని, ఎలా తప్పించాలో కేసీఆర్ కు బాగా తెలుసు. ఎప్పుడు ఏ నేతను దగ్గరకు తీసుకోవాలో, ఏ నేతను దూరం చేసుకోవాలో ఆయనకు తెలిసినంతగా రాష్ట్ర రాజకీయాల్లో మరో నేతకు తెలియదు. గతంలో కేటీఆర్ కు పోటీగా రఘునందన్ రావు ఎదుగుతాడని భావించి ఫైర్ బ్రాండ్ ను ఏవేవో ఆరోపణలతో పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు అదే కోవలో తలసానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఆ నలుగురికి కేసీఆర్ బిగ్ షాక్ – మంత్రివర్గం నుంచి ఔట్
తెలంగాణ క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తరువాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో క్యాబినెట్ లో మార్పులు, చేర్పులు చేస్తారని అంటున్నారు. దీనీపై ఇంకా స్పష్టత రాలేదు కాని, ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసిన ఓ కథనం సంచలనంగా మారింది. అదేంటంటే.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని. నిజంగా ఆ ఛాన్స్ ఉందా..? అంటే లేదని కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దాంతో ఈ కథనానికి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : ఇప్పుడైనా మల్లారెడ్డిని కేసీఆర్ నమ్ముతారా..?
తెలంగాణ ప్రభుత్వం యాదవు కుటుంబాలకు గొర్లను పంపిణీ చేసి ఆ సామజిక వర్గం మద్దతును కూడగట్టుకుంది. అయితే, ఈ గొర్ల పంపిణీ ప్రభుత్వమే చేస్తోంది కాని, క్రెడిట్ మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖాతాలో పడుతోంది. దీంతో తలసానికి యాదవ సామాజిక వర్గం నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని..ఇది ఇలాగె కొనసాగితే ప్రమాదమని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే, రాజకీయాల్లో యాదవ సామజిక వర్గానికి మంచి గట్టు పట్టుంది. ఇది అదే సామజిక వర్గానికి చెందిన తలసానిని తిరుగులేని నేతగా మార్చుతుండగా అదే సమయంలో పార్టీకి ఎదో ఒక రోజు ఈ అంశం ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందని కేసీఆర్ అనుకుంటున్నారట.
Also Read : మల్లారెడ్డిని వదిలించుకునేందుకు కేసీఆర్ ప్లాన్..?
పైగా, ఇటీవల తలసాని సోదరులను ఈడీ అధికారులు ప్రశ్నించడంతో శ్రీనివాస్ యాదవ్ పై కేసీఆర్ నిఘా ఉంచారని ఓ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైంది. ఎందుకంటే, ఈడీ ఉచ్చు నుంచి బయటపడేందుకు గ్రేటర్ కు చెందిన ఓ మంత్రి బీజేపీతో టచ్ లోకి వెళ్ళినట్లు అనుమానిస్తోన్న కేసీఆర్, తలసాని కూడా తన సోదరుల కోసం బీజేపీకి టచ్ లోకి వెళ్ళారా అని నిఘా పెట్టారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను బేరీజు వేసుకొని , తలసానిని ఎక్కువ ప్రోత్సహించడం సరైంది కాదని, అందుకే ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించి కొత్తవారికీ ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట.
Also Read : ఒడిసిన టీఆర్ఎస్ కథ..!
అయితే , ఆయనలో అసంతృప్తి కలగకుండా ఉండేందుకు.. బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. మంత్రి వర్గం నుంచి తప్పించి పార్టీ పదవిలో నియమించనున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..