బైరి నరేష్ అనే నాస్తికుడు అయ్యప్ప స్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై శ్రీ శారద పీఠాదిపతి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయ్యప్ప స్వామిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం హిందూ సమాజాన్ని కించపరచడమేన్నారు.
హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే అయ్యప్ప స్వామిపై అశ్లీలతో కూడిన వ్యాఖ్యలు చేయడం హిందూ సమజానికే అవమాన్నారు స్వరూపానందేంద్ర. ఈ దేశంలో ప్రదానమైన గుళ్ళలో శబరీమల అయ్యప్ప ఆలయం ఒకటి. కాబట్టి ఇలాంటి విదేశీ మత ద్రోహులకు అమ్ముడు పోయిన నాస్తికులు అయ్యప్ప స్వామిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజాన్ని విచ్చిన్నం చేస్తాయన్నారు.
Also Read : బైరి నరేష్ అలా మాట్లాడొచ్చా..?
బైరి నరేష్ వ్యాఖ్యలపై స్పందించని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై మండ్డిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత మంది హిందూ దేవుళ్ళను దూషించి హిందూ సమాజాన్ని కించపరిచే అవకాశం ఉందన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసారు.
మైనారిటీలే కాకుండా హిందువులు కూడా ఓటర్లే అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. అశ్లీల పదాలతో హిందూ దేవుళ్ళను, మనోభావాలను కించపరిస్తే వారిని చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు.