నందమూరి- అక్కినేని కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. బాలయ్య చేసిన వ్యాఖ్యలకు అక్కినేని వారసులు కౌంటర్లు ఇచ్చారు. అటు అక్కినేని.. తొక్కినేని అని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తమతోపాటు ఎస్వీ రంగారావు కుటుంబాన్ని కూడా అవమానించడంతో వారిని కూడా అక్కినేని ఫ్యామిలీకి సంఘీభావం తెలపాలని కోరుతున్నారు.
ఎస్వీఆర్ కుటుంబానికి బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. తామంతా ఒకే కుటుంబంగా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన చాలా జనరల్ గా చెప్పారని వివరించారు. ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించలేదని ఎస్వీఆర్ మనవళ్లు రంగారావు, ఎస్ వి ఎల్ ఎస్ రంగారావు చెప్పుకొచ్చారు.
ఇక, ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయవద్దని కోరారు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి తమకు..తమ కుటుంబ సభ్యులకు..నందమూరి వంశానికి..నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులకు లేఖ ద్వారా సూచించారు.
బాలయ్య గారు SV రంగారావు గారు గురుంచి తప్పుగా ఏం ప్రస్తావించలేదు. ఈ విషయంలో మా కుటుంబ సభ్యులందరికి ఎలాంటి తప్పు కనిపించలేదు. – ఎస్వి రంగరావుగారి కుటుంబసభ్యులు.#SVRangaRao#NandamuriBalakrishna pic.twitter.com/6l30Vyu5wz
— Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) January 25, 2023
Also Read : అక్కినేని…తొక్కినేని – బాలయ్య ఈ కామెంట్స్ చేయడానికి కారణమేంటి ..?