రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇది మా ఇంట్లో అది పెద్ద పండగ అంటున్నారు మెగా డాటర్ సుస్మిత.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే, ఈ మూవీకి సుస్మిత కాస్ట్యుమ్ డిజైనర్ గా పని చేశారు. ఈ మూవీ విషయాలపై స్పందిస్తునే ఆమె పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
మా ఇంట్లో పెద్ద పండగ రాబోతుంది. చరణ్ తండ్రి కాబోతున్నాడు. వారికీ పాప , బాబు ఎవరు పుట్టిన ఆనందమే. మా కుటుంబంలో ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. అందుకే చరణ్ కు బాబు పుడితే బాగుంటుందని తన మనసులోని మాట బయట పెట్టారు సుస్మిత.
ఇక, వాల్తేరు వీరయ్య సినిమాపై స్పందిస్తూ.. డైరక్టర్ బాబీ మాకు వింటేజ్ చిరంజీవి లుక్ కావాలన్నారు. నాన్నను అలా రెడీ చేయాలో మాకు తెలుసు కాబట్టి.. ఈ సినిమా కోసం పెద్దగా కష్టపడింది లేదు. తెరపై నాన్నను చూస్తుంటే మాకో పండగలా ఉందన్నారు సుస్మిత.