శనివారం శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ-20మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరెగిపోయాడు. ఆకాశమే హద్దుగా భీకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ధాటికి లంక బౌలర్లు, ఫీల్డర్లు ఆకాశానికేసి చూడటమే సరిపోయింది. సిక్సులు, ఫోర్లతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య ఇన్నింగ్స్ చూసిన వారంతా ఇదేం బ్యాటింగ్ శైలిరా మావా. ఇలా కొత్తగా ఆడుతున్నాడనేలా వైవిధ్యమైన బ్యాటింగ్ తో అలరించాడు. స్టేడియం నలుమూలలా బౌండరీలు బాది లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు.
బాల్ వేగంతో వేస్తె స్టాండ్ లోకి వెళ్తుంది. దీంతో తెలివిగా లంక బౌలర్లు స్లో బంతులు విసిరినా సేం రిజల్ట్ రుచి చూపించాడు మిస్టర్ 360సూర్య కుమార్ యాదవ్. బాల్ ఎక్కడ వేసినా, ఎలా వేసినా ఫైనల్ రిజల్ట్ మాత్రం బంతి స్టాండ్ లోకి వెళ్ళడమే. దిగ్గజ బ్యాట్స్ మెన్ కు కూడా తెలియని టెక్నిక్ తో క్రికెట్ కు సరికొత్త ఆటను పరిచయం చేస్తున్నాడు సూర్య.
రాజ్ కోటలో సూర్య సుడిగాలి ఇన్నింగ్స్ లంక బౌలర్లు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే సూర్య ఇన్నింగ్స్ అలా సాగింది మరి. క్రీజ్ లోకి వచ్చాక కాసేపు ఆచితూచి ఆడిన సూర్య తరువాత సిక్స్ లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి. లేదంటే బౌండరీ అయిన బాదాలి అనే విధంగా రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లు అలవోకగా బాదుతూ శ్రీలంక బౌలర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేశాడు. కేవలం 45 బంతుల్లో సూర్య కుమార్ యాదవ్ సెంచరీ పూర్తి చేశాడు అంటే అతని ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
శనివారం మ్యాచ్ లో సూర్య ఆడిన ఆట వండర్. అసలు అతను ఆడిన ఆటగురించి ఎంత చెప్పిన తక్కువే. బౌలర్లు ఎలాంటి బంతులు విసిరినా కసి తీరా బాదాడు. మరీ ముఖ్యంగా రజిత వేసిన ఓవర్లో ఒళ్ళును విల్లు లాగా వంచి లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్ ఈ మ్యాచ్ కే హైలెట్. ఇక ఇదే కోవలో రెండు సిక్సర్లు కూడా అలానే బాది భారత ప్రేక్షకులను మైదానంలో కేరింతలు కొట్టేలా చేశాడు.. శ్రీలంక బౌలర్లకు కన్నీటిని మిగిలించాడు.
Also Read : రిషబ్ పంత్ హెల్త్ అప్డేట్ – ఇప్పట్లో గ్రౌండ్ లోకి దిగే ఛాన్స్ లేదా..?