మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయముంది. మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు. నియోజకవర్గాలను మూడు కేటగిరిలుగా విభజించి సర్వేలు చేసినట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యేల పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాల్లో సర్వే సంస్థలు ఇటీవల సర్వేలు నిర్వహించాయి. టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే స్థానాలను ఏ కేటగిరి, కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇంకాస్త ఫోకస్ పెడితే టీఆర్ఎస్ గెలిచే సీట్లను బీ కేటగిరి, బీజేపీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య త్రిముఖ పోరు ఉండే నియోజకవర్గాలను సి కేటగిరిగా విభజించారు.
అయితే, ఈ సర్వేలో టీఆర్ఎస్ కు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు కేవలం 35నుంచి 40వరకు మాత్రమే ఉన్నాయి. ద్విముఖ పోరు ఉండే నియోజకవర్గాలు 30- 34 ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వచ్చినట్లు తెలుస్తోంది. సి కేటగిరిలో మంత్రులు కూడా ఉన్నారు. ఈ కేటగిరికి చెందిన నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు నిరాశ తప్పదని సమాచారం. సి జాబితాలో బీజేపీ , కాంగ్రెస్ సత్తా టీఆర్ఎస్ కు హ్యాట్రిక్ విజయం దక్కడం కష్టమే. సీ కేటగిరిలోనూ బీజేపీ, కాంగ్రెస్ లు సత్తా వచ్చే ఎన్నికల్లో హాంగ్ వచ్చే పరిస్థితి ఉన్నట్లు తాజా సర్వే ఫలితాలు రూడీ చేస్తున్నాయి.