వైఎస్ వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దర్యాప్తు అధికారినున్న రాంసింగ్ ను విచారణ నుంచి తప్పించింది. మరో అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. రాంసింగ్ నేతృత్వంలో విచారణ ఆలస్యం అవుతుందన్న జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం..సీబీఐ ప్రత్యేక సిట్ ఏర్పాటు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సిట్ లో చౌరాసియా నేతృత్వంలో ఆరుగురు సభ్యులు ఉంటారు. వివేకా కేసులో కుట్ర కోణాన్ని త్వరగా వెలికితీయాలని సీబీఐ సిట్ ను ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. ఈ సీబీఐ సిట్ లో ఐపీఎస్ అధికారి, ఎస్పీ వికాస్ కుమార్, అడిషన్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీమతి, మరో ఇన్‌స్పెక్టర్ నవీన్ పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు.
వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆరు నెలల్లోగా ట్రయల్ మొదలు కాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని….ఈ కేసులో నిందితుడుగానున్న శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
సీబీఐ ఎస్పీ ర్యాంక్ అధికారి రాంసింగ్ నేతృత్వంలో ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్బంలో రాంసింగ్ ను తొలగించండి లేదా మరో అధికారిని అదనంగా నియమించండని ఆదేశించింది. ఈ క్రమలోనే మరో అధికారిని నియమిస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.
ఐతే.. రాంసింగ్ ను కొనసాగించడం పట్ల ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వల్లె ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతుందని సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మరో అధికారి నేతృత్వంలో సిట్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ముందు ఉంచగా ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.
Also Read : వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు