‘అదాని – హెండేన్ బర్గ్’ కేస్ పరిశీలన కోసం కేంద్ర లోగడ ఓ కమిటీని నియమించి సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీం కోర్ట్ కు సమర్పించింది. కేంద్రం మీద ఏ మాత్రం నమ్మకం లేని సుప్రీం కోర్ట్ దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్ట్ గురువారం కొత్త కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారి చేసింది.
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే దీనికి నాయకత్వం వహిస్తారు. ఈ కమిటిలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఓ పి భట్, జె పి దేవదత్, ఇన్ఫోసిస్ సహా వ్యవస్తాపకుడు నందన్ నిలేకని, బ్యాంకింగ్ దిగ్గజం కే వి కామత్, సోమశేఖరన్ సుందరేశన్ సభ్యులుగా ఉన్నారు.
మార్కెట్ నియంత్రణ సంస్ట (సెబి) ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది. దీనిని వివరాలను సీల్డ్ కవర్లో పెట్టి రెండు నెలలలోపు సుప్రీం కోర్ట్ కు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ ఆదేశించారు. కొత్త కమిటి కూడా తమ పని మొదలుపెడుతుంది. అదాని గ్రూప్ తన షేర్ లల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడినట్లు తెలిసిందే. అయితే వీటిని రుజువు చేయాల్సి ఉంది.