వైఎస్ వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది వివేకా కూతురు సునీత. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రిని హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల ఆమె హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అవినాష్ రెడ్డి ద్వారానే దస్తగిరితోపాటు నిందితులకు డబ్బులు చేరాయని… వివేకా హత్యకు ముందు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని ఆమె దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ లో పేర్కొన్నారు.
వివేకా హత్యకు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారని సునీత ఆరోపించారు. 2017ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారని పేర్కొన్నారు. 2019లో ఎంపీ సీట్ దక్కదనే వివేకాను పొట్టనపెట్టుకున్నారని పిటిషన్ లో ప్రస్తావించారు. వివేకాను హత్య చేసిన వారిని కాపాడుకుంటానని అవినాష్ రెడ్డి నిందితులకు ప్రామిస్ చేసినట్లు పేర్కొన్నారు. మా నాన్న చనిపోయాడని శివ ప్రసాద్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి సమాచారం అందించాగానే గుండెపోటు వచ్చిందని చెప్పారు. పోలీసులు కూడా గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకొని చనిపోయినట్టు అబద్దాలు చెప్పారని సునీత తెలిపారు. వివేకాను హత్య చేసినట్లు అంగీకరిస్తే 10కోట్లు ఇస్తానని గంగాధర్ రెడ్డికి అవినాష్ రెడ్డి ఆశ చూపినట్లు..స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.
ఈ కేసులో సీబీఐ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోన్న తరుణంలో సునీత ఈ ఇంప్లీడ్ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ హత్యకేసులో అవినాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులను,తన భర్తను బెదిరిస్తున్నాడని ఆమె ఇటీవల ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేయడం హాట్ అయిన సంగతి తెలిసిందే.
Also Read : వివేకా వర్ధంతికి నివాళులర్పించని అబ్బాయిలు