గత కొన్ని రోజులుగా గుండెపోటు వార్తలు చూస్తూనే ఉన్నాం. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. ఒకప్పుడు గుండెపోటు 50ఏళ్ళు పైబడిన వారిలోనే కనిపించేది కాని, ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సడెన్ హార్ట్ ఎటాక్ లు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకుగాను కరోనా వ్యాక్సిన్ ను వందశాతం పూర్తిగా పరిక్షించకుండానే వినియోగానికి ప్రపంచవ్యాప్తంగా అనుమతులు ఇచ్చారు. దాంతో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సడెన్ స్ట్రోక్ లు తలెత్తుతున్నాయని కొంతమంది అనుమానిస్తున్నారు.
కరోనా ముందు గుండెపోటుతో మృతి చెందిన వారి సంఖ్యతో పోలిస్తే కరోనా తరువాత గుండెపోటుతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువ ఉండటం ఈ అనుమానాలను మరింత పెంచేస్తోంది. ఆందోళన కల్గిస్తోంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా సడెన్ స్ట్రోక్ తో మృతి చెందుతున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపు కన్నుమూస్తున్న పరిస్థితి.
కొంతకాలంగా ఎక్కువ మందిలో చాతిలో నొప్పి.. శ్వాస సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని తరుచు వైద్యులను సంప్రదిస్తున్నారు. కోవిడ్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకొని వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పైగా.. ఇటీవల భారతి సంతతికి చెందిన లండన్ వైద్యుడు ఓ సంచలన ప్రకటన కూడా చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ వలన గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు తన పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నందంతా చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది.
ఇప్పటివరకు వ్యాక్సిన్ వలెనే గుండెపోటు వస్తుందని నిర్ధారణ కాలేదు. కానీ గుండెపోటుకు కారణం కరోనా వ్యాక్సినేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే..ఇలాంటి సమయంలో ఆందోళన చెందకుండా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వీలైనంత వరకు ఒత్తిడి లేని ఉద్యోగాలు చెయండని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read : కరోనా వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ తో జాగ్రత్త సుమా..!